పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వెలుగోటి యాచమనాయఁడు

లాతని రాయలకుడిచేయితోఁ బట్టుకొనుట కను వగునట్టు నిలిపి రఁట! తనచేయి చాచి యిదిగో! యీ యుంగరమును గైకొను మని మరల పలికెనఁట! అతఁడు యుంగరము తనకు ముప్పు వాటిల్లఁజేయునని విధివశమున ముందుగాఁ దెలిసి కొన్నవానివలె 'ఓరాజా ! నీయాజ్ఞ నుల్లఘించి నేనీ యుంగరము దీసికొనకున్నందునకు నన్ను క్షమింపము'మని చేతులు శిరస్సునకుఁ జేర్చుకొనియెనఁట! అంత తనచేతి యుంగరమునుదీసి పై కెత్తి తీసికొమ్మని రెండవమాఱు మరల కోరగాఁ జుట్టునున్న దండనాయకులు ప్రోత్సహింపఁ గన్నీ రోడ్చుచు దానిని తీసికొని ముందుగా శిరమునఁ బెట్టుకొని తీసి తరువాత వ్రేలికిఁ బెట్టుకొనియెనఁట! పిమ్మట రాయలు రెండు లక్షల క్రుజడావుల విలువగలిగిన పట్టాభిషేక కాలములందును, ప్రత్యేక పర్వదినములందును సామ్రాజ్యసార్వభౌములు ధరింపఁ దగినదుస్తుల నిప్పించుటయెగాక యాఱు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తన చెవి వజ్రములను, మఱి రెండు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తనచెవికమ్మలను, ఇంకను విలువఁగలిగిన పెద్దపెద్ద ముత్తేములనుఁ దెప్పించి యిప్పించె నఁట! ఇట్టి యాభరణముల నన్నిఁటి నొసంగి తన తరువాత శ్రీరంగరాజు పట్టాభిషిక్తుఁడు గాఁదగిన రాజకుమారుఁ డని ప్రకటించి యుండె నఁట!

తరువాత నాఱుదినములు బ్రదికె ననియు జనిపోవు నప్పటికి నఱువదియేడేండ్లవయ స్సుండె ననియు బర్రాదాసు