పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

47

దయను, ప్రేమను జూపియుండుటను, 1611 వ సంవత్సరము నుండి కొండమ్మకుఁ గొడుకుఁ బుట్టినట్టు కల్పనచేసి రాజ్య మపహరింపవలె నని ప్రయత్నము చేసినారు. కాని వీరవేంకటపతిరాయల మొదట తా నెట్లు ప్రతిజ్ఞపట్టి యాచరించుచు వచ్చెనో దానిని చనిపోవునపుడు సైతము మఱువలేదు.

అయినను సామ్రాజ్యాధీశ్వరుం డగు వీరవేంకటపతిరాయలవారు 1614 వ సంవత్సరములో అక్టోబరునెల నడిమికాలమున దాను మరణించుటకు మూన్నాళ్లకుముందే యొకనాఁడు మంత్రి పురోహిత సామంత దండనాయక దౌపారిక బంధుజన విద్వజ్జన సమక్షంబునఁ దనసోదరపుత్రుఁడు, యువరాజు నగు శ్రీరంగరాజునుఁ దనదగ్గఱకుఁ దీసికొని "నాయనా! శ్రీరంగా! నేనిఁకజీవింపను. నిన్నీ సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిఁజేయుచున్నాను. ఇదిగో! నా చేతియుంగరమును దీసికొని ధరింపుము." అని పలికి తన కుడిచేయి చాచి యాతని కం దిచ్చెనఁట! అట్లు పలికి చేయిచాచినతోడనే శ్రీరంగరాజు గన్నుల వెంట బొటబొటబాష్పజలంబు లొలుక గద్గదకంఠముతో 'మహాప్రభూ! దేవరా! ఈసామ్రాజ్యము నేలుట కెవ్వరుర్హులో నీ యుంగరము వారి కలంకరింపుము. ఈప్రభుత్వము నా యంతట నేను కోరినవాఁడను గాను" అని పలికి సాష్టాంగ పడి బావురు మని యేడ్చుచు నాతని పాదములం బట్టికొనియెనఁట! అపుడు రాయలు తనచుట్టు నున్నవారిని నారాకుమారు లేవనెత్తు డని యాజ్ఞాపింపగా నట్లుగావించి వార