పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వెలుగోటి యాచమనాయఁడు

రాజనియు సుగుణగణములు గలవాఁ డనియు, శూరుఁ డనియు, సౌందర్యవంతుఁ డనియు నభివర్ణించి యుండుటయె గాక వయస్సు వచ్చిన యౌవనవంతుఁడనియు, జిల్లేళ్ళ నారసింహభూపుని పుత్రిక యగు ఓబమ్మను పెండ్లిచేసికొనియె ననికూడ దెలుపఁబడినది. 1599 వ సంవత్సరము నాఁటికి సంతానవంతుఁ డై కూడ నుండవలయును. ఈరామరాజీయ గ్రంథకర్త యగు వేంకయకవి జగ్గరాజును దుర్యోధనునిగాను, ఈ శ్రీరంగరాజుపుత్రుఁ డయిన రామదేవరాయలను, ధర్మరాజునుగాను వర్ణించి యుండుటచేత నీతఁడును నీతని కృతిపతియు జగ్గరాజునకుఁ బ్రతిపక్షకోటిలోనివా రనుట స్పష్టము. మఱియు రామరాజీయమున వేంకటపతిరాయల యన్న కొడుకు శ్రీరంగరాజును, వీనికుమారుఁడు రామదేవరాజును వర్ణించి పిమ్మట వీరవేంకటపతిరాయల గుణగణములను, మాధుర్య మొల్కుబల్కులతో నభివర్ణింపఁబడియెను.

గొబ్బూరి ఓబలరాజపుత్రిక యగు కొండమ్మయే బాయమ్మ యనియు జగ్గరాజు బాయమ్మయన్న యనియు, ఓబల రాయలు మరణించిన వెనుక నీతఁడు తనసోదరి యగు నీరాణి కొండమ్మ మూలమున సామ్రాజ్యమునఁ బ్రముఖుఁడై రాయలపైఁ బలుకుఁబడి సంపాదించి మితిమీఱిన రాజ్యకాంక్షచే దుష్ప్రవర్తనము చూపినాఁడు. ఓబలరాయలు పోయినవెనుక నాతని కుమారుఁ డయినజగ్గరాజునెడను, ఆతని కుమార్తె యగుకొండమ్మ యెడను