పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

45

"సామ్రాజ్యమునందలి మహామండలేశ్వరులలో రాయలకుఁ దరువాత నధికారమును, పలుకుఁబడియు చలాయింపఁ గలవారిలో ఓబలరాయఁ డొక్కడు. ఈతని సంతకముతో రాధారిపత్రము గలవా రెట్టిభయమును, నాటంకమును లేక యేబాటపై నైనను, ఏనదిమీఁద నైనను నిశ్చింతతోఁ బ్రయాణము చేయవచ్చును. ఈతనియాజ్ఞను నుల్లంఘించుట యన నేయుద్యోగస్థుని కైనను మరణశిక్షను బొందుట యగును."

ఇందుఁ బేర్కొనఁబడిన ఓబలరాయలు, వేంకటపతి రాయలమామగారు. రంగరాజు రాయలకుఁ బ్రేమ పాత్రుఁడును, అన్న కుమారుఁడును, దత్తపుత్రుఁడును, యువరాజును నగు చిక్కరాయలు. ఈతని యువరాజుగఁ జేసినట్లు నరపతివిజయమను రామరాజీయములోని :-

         క. అతనికి శ్రీరంగమహీ
            పతి గలిగెను నా మహానుభావుఁడు శౌర్యో
            న్నతి వెంకటపతిరాయనృ
            పతిచే యువరాజుపట్టబంధము నొందెన్.

అను పద్యమువలన విదిత మగుచున్నది. రాయలు తరువాత రాజ్యమునకు రావలసిన యువరాజును చిక్కరాయలనుట దేశీయసంప్రదాయము. కనుకనే రామరాజీయమున శ్రీరంగ చిక్కరాయమనుజవిభుడే చిక్కరాయ లనియు, యువ