పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

43

సాధ్య మగుచున్నవి. అందుగుల వెంకయవిరచిత మగు నరపతివిజయమునందు :-

        "సీ. పరమపాతివ్రత్యగరిమచే మిక్కిలి
                   యతిశయిల్లినవెంకటమ్మగారిఁ
            జిరయశోనిధి యైనజిల్లేళ్ల రంగనృ
                   పాధిపు పుత్రి నోబమ్మగారి
            జిల్లేళ్లకృష్ణరాట్చీతమయాఖు ప్రి
                   యాత్మజ యైనకృష్ణమ్మగారి
            భూరి శౌర్యోగ్ర గొబ్బూరి యోబక్షమా
                   ధ్యక్షు తనూజఁ గొండమ్మగారి
         గీ. నెమ్మివరుసఁ బాణిగ్రహణమ్ముఁ జేసి
            వీర వేంకటపతిరాయవిభుఁడు వేడ్క
            నలరు నప్పద్మముఖులతో ననుదినంబు
            నధికసౌఖ్యాంబునిధి నోలలాడె మిగుల."

అని యభివర్ణించి యున్నాఁడు. ఇందుఁ బేర్కొనఁబడిన కొండమ్మతండ్రి యగుగొబ్బూరి యోబక్షమాధ్యక్షునకుఁ బై చాటువునందుఁ బేర్కొనఁబడిన గొబ్బూరి జగ్గరాజు కుమారుఁ డై యుండును.

వేంకటపతిరాయలునకు సంతానము లేదు గావున నతని వెనుక సింహాసనము నధిష్ఠింపఁదగిన హక్కు గలవా రాతనియన్న యైనరామరాయని కుమారులగు తిరుమల