పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

           ఉ. గొల్పురి జగ్గరాజు లొకకోటియుఁడెబ్బదికోట్ల మాకరా
               జబ్బలు లక్ష్మిమీఁద బదియార్గురు రా వెలువెంకులైనమా
               నిబ్బరగండయాచధరలోపతి ముందట నిల్వ

అతిస యోక్తులతో గూడిన యీపైచాటుపద్య మొకఁటి యాంధ్రవాఙ్మయము నలంకరించి చాటుపద్యరత్నాకరమను గ్రంథమున గన్పట్టుచున్నది. చదువరుల స్థూలదృష్టికి నట్లు గాన్పించినను ఒక కాలంబున దక్షిణహిందూ దేశచరిత్రము నందు సంభవించిన మహాభయంకర మగునట్టియు, మహాద్భుతమగునట్టియు నొక మహావిప్లవము కడదాటించిన యొక మహావీరవ్యక్తియొక్క చరిత్రశోభను గర్భీకృతము గావించికొని యామహావ్యక్తియొక్క యశోవైభవము దిగ్దిగంతములవఱకు వెదజల్లునట్టిదిగా నున్నది. ఈవిప్లవము విజయనగరసామ్రాజ్యము నారవీటివంశస్థు లయినరాజులు పరిపాలన చేయుకాలమునఁ బదియేఁడవశతాబ్దిమొదట, అనఁగా 1614 వ సంవత్సరమున రాయవేలూరునగరమున మొట్టమొదట ప్రారంభ మైనది. దీనికి ముఖ్యకారకుఁడు పై చాటువులోని జగ్గరాజు, వీనికి దక్షిణవామహస్తములుగా నేర్పడి తోడ్పడి విప్లవాగ్నిని విజృంభింపఁ జేసి మండఁబెట్టినవారు