పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38
విశ్వనాథనాయకుఁడు

స్థానములయందు నిలుపుటచే పొందియుండ వచ్చును. ఎట్లయినను ఈతని పరిపాలన కాలమునఁ బాండ్యదేశ మంతయుఁ నభివృద్ధికిఁ గొనిరాబడి తెలుఁగువానికిని, తమిళులకు నైకమత్యముఁ గలిగియుండి యుభయసంఘములవారును విజయనగరసామ్రాజ్యమునకుఁ దోడ్పడుట కవకాశమును, స్థిమితమునుఁ గలుగఁజేసె నని చెప్పవచ్చును. ఇతఁడు తన కాలమున దనపేరిట సొంత నాణెములనుఁ బ్రకటించెను.


_________