పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వనాథనాయకుఁడు

35

విజృంభణము నడగించి వారినుండి కప్పములు గైకొని యాభాగములందు శాంతి నెలకొనునటుల పాండ్యరాజ్యమును బలపఱచి విశ్వనాథనాయనివారి పరిపాలనమును దృఢపఱచి రావలయునని పెనుగొండరాజ్యాధిపతియైన విఠ్ఠలరాయని, వీని తమ్ముఁడును, చంద్రగిరిరాజ్యాధిపతియైన యౌకు చినతిమ్మరాజును దక్షిణదేశమునకుఁ బంపించెను. విఠ్ఠలదేవరాయలు రాజప్రతినిధిగా నియమింపఁబడియెను. విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యములోపలి వ్యవహారములను జక్కఁబెట్టుకొనుచు, వెలుపలివ్యవహారములయందు సామ్రాజ్యప్రతినిధి యగువిఠ్ఠలదేవరాయనికిఁ దాను గాని తనకుమారుఁడు కృష్ణప్పనాయనివారు గాని యప్పటప్పట తోడుసూపు చుండెను. విఠ్ఠలదేవరాయలు 1558 వ సంవత్సరమువఱకు రాజప్రతినిధిగా దక్షిణదేశమున వ్యవహరించెను. విఠ్ఠలదేవరాయలు తనతమ్ముఁ డయిన చినతిమ్మరాజుతోఁగూడి తిరువడి రాజ్యమును జయించి వానితో సంధికార్యమున కొడంబడి సామ్రాజ్యమునకు రావలసిన కప్పముల నన్నిటిని రాఁబట్టఁ గలిగెను. పోర్చుగీసువారిని, పరవజాతివారిని జయించి పోర్చుగీసురాజ్యమునకుఁగాక పాండ్యరాజ్యమునకు లోబడి కప్పములు చెల్లింప నియమబద్ధులను గావించెను. ఈసందర్భములయందు విశ్వనాథనాయనివారు తా నొక స్వతంత్రరాజువలె, బ్రవర్తింపక సామ్రాజ్యమునకు సామంతుఁడ నను