పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26
విశ్వనాథనాయకుఁడు

ఇట్లు తెంగాశి పాండ్యులను జయించినవెనుక విశ్వనాథనాయని వారు తన ప్రధానమంత్రితోఁగలసి రాజ్యాభివృద్ధి మార్గముల నాలోచించి యందుకుఁ దగినకృషి ప్రారంభించెను. తిన్నెవెల్లి పట్టణమును విస్తరింపఁజేసి యభివృద్ధి పఱచెను. దేవాలయములను నిర్మించెను. ఎట్లు గ్రామపరిస్థితులఁ జక్కచేసి పరిపాలనము నడుపవలసియుండునో యారీతి నడుపునట్లు గావించెను.

చెఱువులను, కాలువలను ద్రవ్వించి తనరాజ్యము నందలి గ్రామాదులలోని వ్యవసాయకులను భూములనిచ్చియు, ధనము నొసంగియుఁ గృషివ్యాపారము లభివృద్ధి నొందునటులు మనఃపూర్వక మైనప్రేమను జూపుచుఁ బ్రవర్తించెను. అందువలన వ్యవసాయ మభివృద్ధిని గాంచెను. దేశమునందంటట క్రమమైనశాంతి నెలకొనియెను. ఇతనిపరిపాలనమునఁ బ్రజలు సంతృప్తిఁ గాంచిరి. ఈతనిరాజ్యమున కుత్తరమున ఉఱ్ఱాత్తూరు, వలికొండపురములును, దక్షిణమునఁ గన్యాకుమారియు, పశ్చిమభాగమున కోయంబత్తూరు, ఈరోడు, ధారాపురము, మేలమలై, తూర్పున సముద్రమును రామేశ్వరమును సరిహద్దులుగా నేర్పడి రాజ్యము వ్యాప్తిఁ జెంది యుండెను. అనఁగా నిప్పటిమండలము లగు మధుర, రామనాథము, తిన్నెవెల్లి, తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలము, నా కాలమున విశ్వనాథనాయని పాండ్యరాజ్యముగా నుండె నని చెప్పఁదగును. విజయనగరసామ్రాజ్యమువారి పదునాఱవశతాబ్దిలోని శాసనములన్నియు నీమండలములలోఁ