పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

విశ్వనాథనాయకుఁడు

దేశమున (తిన్నెవెళ్లి మండలము) కాయత్తత్తూరునకుఁ జుట్టునుండు దేశమున నైదుగురు సామంతులు పంచపాండ్యులను నామకరణము వహించి విశ్వనాథనాయనివారి పరిపాలన మంగీకరింపక కప్పములు చెల్లింపక దేశమున శాంతిలేకుండఁ జేసి ద్వేషమును బెంచి సరకుగొనక స్వతంత్రులై విహరింపసాగిరి. వీరలు ప్రాచీన పాండ్య రాజుల సంతతివారలని కొందఱును, చంద్రశేఖరపాండ్యుని ప్రపితామహుని యుంపుడుకత్తెకుఁ బుట్టినవారని మఱికొందఱును వ్రాసి యున్నారు గాని వాస్తవచరిత్రము దెలిసికొన సాధ్యముకాదు. కాని వీరలను జయించినఁగాని దక్షిణదేశమున శాంతి నెలకొల్ప సాధ్యముగాక యుండెను. ఈకార్యమును నిర్వహించుటకై విశ్వనాథనాయనివారు 'అరియనాథ మొదలారిని నియోగించెను. ఇతడు మొదట సామోపాయముచేత వారలను స్వాధీనపఱచుకొనవలయు నని యనేక విధములఁ బ్రయత్నించి చూచెను గాని వాని ప్రయత్నము లన్నియు నిష్ఫలములైపోయెను. తెంగాశిలో నుండునీపాండ్యులకు తిరువడిరాజ్యాధిపతి యైనభూతల వీరరామవర్మ సమస్త విధములఁ దోడ్పడుచుండుటచేత విశ్వనాథనాయని వారు తిరువడిరాజ్యముపై గూడ దండెత్తవలసి వచ్చెను. అపు డీరెండుకార్యములను నిర్వహించుట విశ్వనాథనాయనివారికి దుర్భరమై యీ వృత్తాంతము నంతయు విజయనగర సామ్రాజ్యధీశ్వరుఁ దయినయచ్యుత దేవరాయలవారికి దూత