పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

23

సెను. శ్రీరంగదేవాలయము ననేకనూతనభవనములతో నలంకరింపఁజేసి కన్నులపండు వౌనట్లుగా దిద్ది తీర్పరింపఁజేసెను. ఈదేవాలయ రక్షణకొఱకు మూఁడులక్షలపొన్నుల ద్రవ్యమును వెచ్చించెను. ఈప్రాకారములలోపల జనులు నివసించుటకై యనేకగృహములను గట్టించెను. ఇట్లు ప్రధాన దుర్గములను ముఖ్యములయిన దివ్యక్షేత్రములను చక్కపఱచుకొనుటకై విశేషద్రవ్యమును వెచ్చబెట్టి కృతకృత్యుఁడై ప్రజానురాగమును బడయుటయెగాక రాజ్యములోఁ దిరస్కార భావముతో నొప్పెడు ప్రభువతంసుల నెల్లర జయించి సరయిన మార్గమునకుఁ గొనివచ్చి రాజ్యము నలుప్రక్కల శాంతి నెలకొల్పఁ బూనుకొనియెను. ఇతఁడు రాజ్యభారమును వహించి పరిపాలనము చేయుటకుఁ బ్రారంభించిన కొలదిదినములలోనే చోళరాజ్యమునఁ జోళవంశీయుఁడ నని చెప్పుకొను నొక చోళ సామంతుఁడు కంబము, గూడలూరుసీమ నాక్రమించుకొని విశ్వనాథనాయని పరిపాలనమును దిరస్కరించి కప్పమును జెల్లించక చిక్కులు పెట్టుటకుఁ బ్రారంభించెను. అంతట విశ్వనాథనాయకుఁ డాతని శిక్షించి రాజ్యమును వశపఱచుకొని కప్పము గైకొని రావలసినదిగాఁ దనతండ్రి ప్రియమిత్రుఁడును, భృత్యుఁడుగ నున్న రామభద్రనాయకుని నియమించెను. అతఁ డట్లు తన కార్యమును జయప్రదమగునట్లుగా నిర్వహించుకొని వచ్చినందుకు సంతోషించి విశ్వనాథనాయఁ డాతనికి 'వడగరై' యను పాళియము నొసంగి సన్మానించెను. దక్షిణపాండ్య