పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

విశ్వనాథనాయకుఁడు

చెను. విశ్వనాధనాయఁ డాధనము నంతయుఁ గాంచి యెట్లీతఁడింత ధనమార్జింపఁగలిగెనా యనియాశ్చర్యముఁ జెందెను.

ఇ ట్లచ్చెరువందుచున్న కుమారుని జూచి 'పుత్రా! ఈ మధురానగరము నాకిష్టదైవములగు మీనాక్షీసుందరేశ్వరులకు నిలయమై దివ్యస్థలముగాఁ బేరుగాంచి యున్నది. ఒకనాఁడా మీనాక్షీదేవి నాకు స్వప్నములోఁ గానుపించి నీకుమారుఁడు విశ్వనాథనాయఁడు నా సన్నిధానముననుండి యీపాండ్యరాజ్యమునంతయు నేలుటకు సమర్థుఁ డయి యుండు నని చెప్పియున్నది. ఈ యర్థమునంతయుఁ దీసికొనిపోయి పాండ్యదేశములోని దేవస్థానమునకును, తీర్థప్రదేశములలోని యేళ్ళుకుఁ గట్టు ఱాతిమెట్లకును ఇంక ననేకధర్మకార్యములకొఱకును వినియోగ పఱచినయెడల నాకు పరలోకసౌఖ్యము గలుగఁగలదని బహువిధముల బోధించెను. అటుతరువాత రాయలవారొకనాఁడు విశ్వనాథనాయనివారిని, పాండ్యుని రప్పించి పాండ్యునితో నిట్లు ప్రశంసించెను. "ఓయీ! నీకు సంతానము లేదనియు నుంపుడుకత్తెకును నొక్క కొడుకుమాత్రము గలడనియు, విశ్వనాధనాయనికి రాజ్యమొసంగుట సమ్మతమేయని చెప్పి యాయనకు పత్రము వ్రాసియిచ్చియున్నావనియుఁ దెలిపితి నైన నింకొకమా ఱడుగుచున్నాను. నీ యభిప్రాయమేమో స్పష్టముగా విప్పి చెప్పుము."

ఇట్లు రాయలు ప్రశంసించిన వెనువెంటనే చంద్రశేఖరపాండ్యుఁడు వినమ్రుఁడై లేఁచి సభాసదులెల్లరు విను