పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

15

నారు. ఈ మహాకార్యమును నిర్వహించుటకై దేవర పంపినద్రవ్యము చాలక నాస్వంతద్రవ్యమునుకూడ విశేషముగా వ్రయపెట్టి యున్నాను. ఇట్లెంతో శ్రమపడి చోళుని జయించి పాండ్యరాజ్యమును పాండ్యునికిచ్చి పట్టాభిషిక్తుని గావింపఁ బూనితిని గాని, చంద్రశేఖరపాండ్యుఁడు నా కడకు వచ్చి ఈ వీరశేఖరచోడుని జయించుట తమ కొక్కరికే సాధ్యపడినదిగాని యితరులకు సాధ్యపడునది కాదు; ఇప్పటికిని రాజ్య మరాజకముగనే యున్నది. చోళుఁడు పాండ్యరాజ్యము జయించినాఁ డనుమాటయె కాని రాజ్యములోని గ్రామము లన్నియు వానిస్వాధీనమునకు రాలేదు. ఆకాలమున గ్రామములన్నియు నెట్లు స్వతంత్రముతోఁ బ్రవర్తించినవో చోళునికాలమునఁగూడ నట్టిస్వతంత్రముతోనే ప్రవర్తించుచున్నవి. అయినను మాశత్రువునుఁ గొట్టి రాజ్యమును స్వాధీనపఱుచుకొన్నారు. ఇదియె మాకు పదివేలు. నాకు సంతానము లేదు. ఉన్న వారందఱు నుంపుడుకత్తెకొడుకులు. నాజీవ మున్నంతవఱకు మర్యాదగాఁ గాలక్షేపము చేయుట కన్నవస్త్రాదులకు లోపము లేకుండ నిచ్చి నా యీ రాజ్యము నా పగవాఁ డైనచోళరాజునకుఁ జెందనీక నా పేరుమీఁదుగా మీరే యీ రాజ్యమునుఁ బరిపాలించుకొనుచుండినఁ జాలు" నని చెప్పియున్నాఁడు. అప్పు డీ రాజ్యాలు రెండు నరాజకముగా నుండియుండుటచేత నా ధనము విశేషముగా వినియోగించి యల్లరుల నడంచి శాంతి నెక్కొలిపి