పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[2]

విశ్వనాథనాయకుఁడు

9

గలేచి 'అహో! మన ప్రభూ! దేవరవారియుత్తరు వైనయెడల నిదెపోయి నాగనాయనిఁ గొనివచ్చుచున్నా' నని తడువుకొనక ప్రత్యుత్తర మిచ్చెను. సభ్యులెల్లరు విశ్వనాథనాయని ధైర్యసాహసముల కబ్బురపడసాగిరి. "ఓహో! నాగమనాయని కుమారుఁడవా? ఇదే సందుగాఁ జేసికొని నీతండ్రిని నీవు గలియఁగోరి మాయాజ్ఞనడుగుచున్నావా?' అని యధిక్షేపించెను. అంత విశ్వనాథనాయఁడు "దేవరవారిసొమ్ము తినుచున్న నాకు దేవరవారికార్యము ప్రధానముగాని నాకు తండ్రియెక్కువకాదు." అని ప్రత్యుత్తరము పలికెను. రాయలచ్చెరునందుచు మాఱుపల్కక మౌనము వహించెను. అంత నాతని మౌనమే యంగీకారసూచనగా గ్రహించి రాయల రాణువ తోడ్పాటుగొనక తనస్వాధీనమున నున్నసైన్యమునేగొని తనప్రతిజ్ఞ తీర్చుకొనుటకై పాండ్యరాజ్యమీదికిఁ బోయెను. అట్లు విశ్వనాథనాయఁడు మధురాపురము సమీపమునకుఁ బోయి యొక విశాలమైనప్రదేశమున దండు విడిసి తన తండ్రి కిట్లు జాబు వ్రాసి పంపెను.

"మీరు రాయలవారి యుత్తరువును దిరస్కరించి స్వతంత్రముగాఁ బ్రవర్తించుచున్నారు. మిమ్మును తలకొట్టి తెమ్మని యుత్తరు వైనది. అయిన నేమాయను. ఇంతటనైన నుపేక్ష వహింపక పాండ్యుని పాండ్యరాజ్యమునకుఁ బట్టముగట్టి మీరు రాయలవారి సాన్నిధ్యమునకు వచ్చిన యెడల వారితోఁ జెప్పవలసినవిధముగాఁ జెప్పి వారి యాగ్రహము ముడివ రక్షించునటుల ప్రయత్నింతును రండు."