పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

7

యుండెనఁట! రాజ్య మరాజకముగ నుండుటచేతనే వీర శేఖరచోడుఁ డీ రాజ్యము నాక్రమించెను. ఇందుకుఁ గారణము పూర్వపురాజున కీతఁ డౌరసపుత్రుఁడుగాక యుంపుడుగత్తె పుత్రుఁ డగుటవలన నీరాజ్యమునందలి ప్రభువులును, ప్రజలును నీతని పాలన మంగీకరింపక నలుప్రక్కల స్వతంత్రసీమల నేర్పాటుచేసికొని పాలన సేయుచుండిరి. ఈ కారణమున వీరశేఖర చోడుఁడు మంచిసమయము దొరికినని వీనిపై దండెత్తి వచ్చి యీ రాజ్యము నాక్రమించి వీని నావలకుఁ బాఱఁదోలినవాఁడు. నేను వచ్చి దేశములోని యరాజకము నడచి నా స్వంతద్రవ్యము నెంతో వెచ్చించి రాజ్యమునంతయు స్వాధీన పఱచుకొని దేశమున శాంతిని నెలకొల్పి కొంతకాలమయిన దేశము నెమ్మదిగానుండఁగోరియు, ఇందుకై నేను వెచ్చించిన ద్రవ్యమును మరల రాబట్టుకొనువఱకు రెండురాజ్యములను నేనే పరిపాలింపఁ గోరియు నీ దేశమున నిలిచియున్నాను గాని మఱియొక కారణముచేతఁ గాదు. వీనికి రాజ్యము నొప్పగించినను సామర్థ్యముతో బరిపాలించుశక్తి యీతనికి లేదు. మరల దేశము నరాజకము పాల్పఱచుటయెగాక కప్పము రూమునఁ చెల్లింపబడుచున్న ద్రవ్యమును గోల్పోవలసివచ్చును. ఏతన్మూలమున సామ్రాజ్యమునకు ద్రవ్యనష్టము గూడ సంభవించును. ఈ పాండ్యరాజ్య మరాజకముగ నుండినఁ దక్కిన రాజ్యములుగూడ నరాజకములై చెడిపోఁగలవు. అపుడు సామ్రాజ్యభారము దుర్భరమై గోటితోఁ దునిమినఁ బోగలి