పుట:1857 ముస్లింలు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

సంగ్రామంలో స్వయంగా పాల్గొని ఆంగ్ల సైన్యాలతో తలపడిన ధార్మికవేత్తలలో ఉత్తరాదికి చెందిన మౌలానా హాజి ఇమ్‌దాదుల్లా ముహాజిర్‌, మౌలానా ఖాసిం నానాతవి, మౌలానా రషద్‌ అహ్మద్‌ గంగోహీ, మౌలానా అబ్దుల్‌ హాయ్‌ ఉన్నారు. ఢల్లీ సమావేశంతో సంబంధ లేకున్నా ఆంగ్లేయుల మీద ఉన్న వ్యతిరేకత భూమికగా మౌలానా ఫజలుల్‌ హఖ్‌ ఖైరతాబాది, మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాది, మౌల్వీ లియాఖత్‌ అలీ ఖాన్‌ తదితరులు పోరుబాట నడవగా దక్షిణాదికి చెందిన మొఎల్వీ అల్లావుద్దీన్‌, మౌల్వీ ఇబ్రాహీం, మౌల్వీ అక్బర్‌ తదితరులను బ్రిటిష్‌ వారితో తలపడిన ఇస్లామియా పండితులలో ప్రముఖులుగాపేర్కొనవచ్చు.

మౌలానా హాజి ఇమ్‌దాదాుల్లా ముహాజిర్‌, మøలనా ఖాశిం నానాతవి, మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహీ, మౌలానా అబ్దుల్‌ హాయ్‌ తదితరులు ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి కేంద్రంగా సాగిన సమరంలో ప్రదాన పాత్ర వహించారు. మౌల్వీ అహ్మదుల్లా షా పెజాబాది ఉత్తర హిందూస్థానంలోని పలు ప్రాంతాలలో ఆంగ్ల సైన్యాలను పరాజితులను చేసిన మహాయోధుడు. మౌల్వీ లియాఖత్‌ అలీ అలహాబాద్‌ను కేంద్రంగా చేసుకుని విముక్తి పోరాటంలో విజయం సాధించిన పండితుడు.

మౌల్వీ సర్ప్రాజ్‌ అలీ లాంటి ధార్మికులు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సర్వసైన్యాధికారి భక్త్ ఖాన్‌ను ఆంగ్లేయుల మీద పోరుసాగించమని ప్రోత్సహించిన సాహసి. ఢిల్లీ కేంద్రంగా చాలా కాలం గడపిన ఆయన ఆంగ్లేయుల మీద తిరబడమని ప్రజలను ప్రేరేపించారు. ముఫ్తి సదరుద్దీన్‌ ఖాన్‌ తిరుగుబాటు సమయంలో ఇటు ప్రజలకు అటు తిరుగుబాటు యోధులకు సంధానకర్తగా వ్యవహరించారు. 1857 అగస్టు ఒకటిన బక్రీిద్‌ పండగ సందర్భంగా ఖుర్భాని విషయంతో తలెత్తిన వివాదాన్ని ఆయన సామరస్యంగా పరిష్కరించి తిరుగుబాటు యోధులలో చీలికను నివారించారు.

మౌల్వీ అల్లావుద్దీన్‌ హైదారాబాదు రెసిడెన్సీ మీద జరిగిన దాడిలో ప్రముఖ పాత్ర వహించగా మౌల్వీ ఇబ్రాహీం ఆనాటి పోరాట యోధులను ఉత్తేజపర్చుతూ తిరుగుబాటు పతాకంతో విప్లవకారులను ముందుకు నడిపిన యోధుడు కాగా మౌల్వీ అక్బర్‌ ప్రజలలో స్వేచ్ఛ-స్వాతంత్య్రాభిలాషను రగిలించేందుకు సాహసోపేత చర్యలకు పూనుకున్ననిర్భయుడు.

94