పుట:1857 ముస్లింలు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

నుండి సాగాలనీ అందులో ఒకటి షామ్లి కేంద్రంగా మౌలానా ఇందాదుల్లా ముహాజిర్‌ మక్కి నాయకత్వంలో, మౌలానా జాఫర్‌ థానేశ్వరి నాయకత్వంలో అంబాలా వేదికగాచేసుకుని మరొకటి జరగాలని సమావేశంలో పాల్గొన్న ఉలమాలు పథక రచన చేశారు. (భారత స్వాతంత్య్ర సాధనలో ముస్లిం త్యాగాలు, ఉర్దూ కూర్పు మౌలానా ముహమ్మద్‌ ఉబైదుర్రహ్మాన్‌, తెలుగుసేత: అఫ్రోజ్‌ అహ్మద్‌, ఇస్లాం కాంతి ప్రచురణలు, విజయవాడ, 2002, పేజి. 14)

ఈ ధార్మిక పండితులలో ఫిరంగీ మహాల్‌ (లక్నో) కు చెందిన ప్రముఖ ధార్మికవేత్త మౌలానా ఫజలుల్‌ హక్‌ ఖైరతాబాది బ్రిటిష్‌ వ్యతిరేక భావాల ప్రచారంలో రచనా పరంగా ప్రధాన భూమిక నిర్వహించారు. ఆయన నిర్వహిస్తున్న ప్రభుత్వ పదవిని త్యాగం చేసి 1857 తిరుగుబాటు సమయంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో కలం యోధునిగా తనవంతు పాత్ర నిర్వహించారు. ప్రథమ భారత స్వాతంత్య్రసంగ్రామ సర్వసైన్యాని ముహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌ను కలిసి ఆయనతో తిరుగుబాటు తీరుతెన్నుల గురించి చర్చించారు. చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ఆయనతో పలు విషయాల మీద సలహాలు సంప్రదింపులు జరిపారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ప్రచారం ఫలితంగా పలువురు మౌల్వీలు వచ్చి ఆయనతో చేతులు కలిపారు. ఆంగ్లేయుల మీద యుద్ధం అనివార్యమని, ఇది ధార్మికంగా కూడ ప్రతి ముస్లిం విధి అని ఆయన ప్రకటించారు.

ఈ ప్రకటనకు స్పందించిన మౌల్వీ అబ్దుల్‌ ఖదీర్‌, ఖ్వాజి ఫైజ్‌ అహ్మద్‌ బదౌని, మౌల్వీ ముబారక్‌ అలీ రాంపూరి, ముఫ్తి సద్రుద్దీన్‌, డాక్టర్‌ వజీర్‌ అక్బరాబాది తదితరులు తిరుగుబాటు దిశగా ఆయన వెంట నడిచారు. (Muslims and India's Freedom Movement, Shan Muhammad, IOS, New Delhi, 2002, Page.22) ఈ సమావేశాల పర్యవసానంగా బ్రిటిషర్ల మీద తిరుగుబాటుకు సమాయత్తం కావడం ప్రతి ముస్లిం విధిగా ప్రకటిస్తూ మొత్తం మీద 30 మంది మౌల్వీల సంతకంతో ఫత్వా వెలువడింది.

ఈ విధాంగా ఇస్లామీయా పండితులు ఫత్వా జారీచేయటంతో అధికారులు ఖంగుతిన్నారు. మొఎల్వీలతో ఎంతో కాలంగా పలు కిష్తతరమైన పోరాటాలు చేస్తూ వచ్చిన


92