పుట:1857 ముస్లింలు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంది అసలుసిసలు 'మేధావులు' స్పష్టపరిచారు.
జ్ఞాన కేంద్రాలుగా విలసిల్లి, వేగుచుక్కల్లా వెలుగుతూ సమాజావసరాల పట్ల స్పందిస్తూ, సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన విశ్వవిద్యాలయాల పరిస్థితి యింత ఘనంగా దిగజారిన సందర్భంలో అణగారిన వర్గాలే తమకు కావాల్సిన జ్ఞాన సంపదను సృష్టించుకుంటున్నాయి; జ్ఞాన ప్రచార/ప్రసార కార్యక్రమాలు చేపడుతూ జ్ఞాన సంపద ప్రజాస్వామీకరణకు శ్రీకారం చుడుతున్నాయి. దళితులు, స్త్రీలు, మత మైనార్టీలు తమ సమస్యల పరిష్కారాణుగుణ్యమైన దృక్పథాలతో పుస్తకాలు తెస్తున్నారు. ఇలాంటి పుస్తకాలు బహుళ జనాదరణ పొందుతున్నాయి; సామాజిక ఉద్యమాల నేపధ్యంల్లోంచి రావడం వల్ల వీటికి బలం, జనాదరణ కలుగుతున్నాయి. ఇలాంటి రచనలే ఒక అధ్యయనాంశంగా 'చరిత్ర' అవసరాన్ని నొక్కి చెబుతూ, దాన్ని ప్రధాన చర్చనీయాంశంగా మార్చాయి.
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచనలను మనం ఈ నేపధ్యంలోనే అర్థం చేసుకోవాలి. ప్రజల్లోంచి వస్తున్న రచనలు కాబట్టే నశీర్‌ రచనలకు యింతటి ప్రజాదరణ లభిస్తుందని నేను బలంగా భావిస్తున్నాను. నశీర్‌ అహమ్మద్‌ పాత్రికేయుడు, న్యాయవాది, రచయిత. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ ఇంత వరకు ఆయన రాసిన ఏడు పుస్తకాలు పలుమార్లు తిరగరాయబడి వివిధ ప్రచురణకర్తల ద్వారా ముద్రించబడ్డాయి. ఇటీవల పెచ్చరిల్లిపోతున్న మతతత్త్వ చరిత్రకు ఆయన రచనలు సమాధానం అని చెప్పాలి. ముస్లింలు ఈ సమాజ, దేశ చరిత్ర నిర్మాణంలో భాగస్వాములనీ, ఈ విషయంలో వారి బీళిదీశిజీరిలీతిశిరిళిదీ ఎవ్వరికీ తీసిపోనిదనీ ఆయన రచనలు రుజువు చేస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించే ఎన్నో చారిత్రక వాస్తవాలను ఆయన మనముందుంచుతున్నారు. ప్రస్తుత పుస్తకం దాని కొనసాగింపు.
1857 'తిరుగుబాటు' విూద ఎన్నో గ్రంథాలున్నప్పటికీ అందులో ముస్లింల పాత్రకు సంబంధించీ, ముస్లింల గూర్చి వివరించిన పుస్తకాలు చాలా అరుదనే చెప్పాలి. 1857 సంఘటనలను కొందరు 'ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం' అని, యింకొందరు 'తిరుగుబాటు' అని అన్నారు; మరికొందరు అది కేవలం మత స్వభావంగల 'సాంఘిక తిరుగుబాటు' అన్నారు. కానీ నశీర్‌గారు అందులోని 'ప్రజాస్వామ్య' కోణాన్ని చూపెడుతున్నారు. దీని నిరూపణార్థమై ఆయన పలు ఉదంతాలను చూపించడంతోపాటుగా పుస్తకం చివర్లో రెండు అనుబంధాలను కూడా పొందుపర్చారు. 'తిరుగుబాటుదారులు' ఢిల్లీ పాలనకై పరిపాలనా