పుట:1857 ముస్లింలు.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు.pdf

అధ్యాయం - 3

మౌల్వీలు

బ్రిటిష్‌ పాలకులపై ప్రథమ స్వాతంత్య్ర సమరానికి సుమారు వంద సంవత్సరాల ముందే స్వదేశీయులలో ఆంగ్గేయుల పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకతకు ధార్మిక గురువులు తాత్విక భూమిక అందించారు. మొగల్‌ పాలకులు బలహీనపడుతూ, ఆంగ్లేయుల పెత్తనం అధికం కావడంతో ఏర్పడిన ప్రత్యేక పరిసితులు సామాన్య ప్రజలతోపాటుగా ధార్మిక సంస్థలను కూడ బాగా ప్రభావితం చేశాయి. ఆ కారణంగా పలు ధార్మిక మార్గాలను అనుసరిస్తున్నప్రజలు గల బహుళ సంస్కతుల సమాజంలో చోటు చేసు కుంటున్న ధార్మిక ప్రతిష్టంభనలను చవిచూసిన ధార్మిక పండితులు స్వదేశీయుల లౌకిక-ధార్మిక చింతనకు ఏర్పడుతున్న దుస్థితిని గమనించారు.

ఈ దుస్థితికి ఇటు స్వదేశీపాలకుల బలహీనతలు, పరాయి పాలకుల చర్యల తోపాటుగా అటు ఇస్లాం బోధించిన మౌలిక సూత్రాల నుండి స్వజనులు మార్గంతప్పుతున్నవైనాన్ని గుర్తించారు. ఈ జిటిల సమస్యను పరిష్కరించేందుకు ఇటు ధార్మిక, అటు రాజకీయ రంగాలలో మార్పుల కోసం ఆలోచనలు చేశారు. ఆ ఆలోచనల పర్య వసానంగా పరదేశీయులను పాలద్రోలడం, మార్గం తప్పిన స్వజనులను ఇస్లాం ప్రబోధించిన

85