పుట:1857 ముస్లింలు.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మహిళలు

రాశాడు. ఆ లేఖలో నేను మీ వద్దకు ఒక ముస్లిం ముదుసలిని పంపుతున్నాను. ఆమె విచిత్రమైన మహిళ. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరిస్తుంది. కంపెనీ మీద తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టడం ఆమె పని. స్వయంగా ఆయుధాలు చేపట్టి తిరుగుబాటు దారులకు నాయకత్వం వహించి మన స్థావరాల మీద దాడులు చేస్తుంది. పలుమార్లు మన స్థావరాలపై ధైర్యసాహసాలతో విరుచుకుపడింది. ఆమె ఆయుధం చేపడితే ఐదుగురు సాయుధ పురుషులతో పోరాడగల శక్తివంతురాలని, ఆమె బారిన పడిన మన సిపాయిలు, అధికారులు చెబుతున్నారు. ఆమె పట్టుబడిన రోజున, శిక్షణ లక్నోలోని బేగం హజరత్‌ మహల్‌ అంత:పురం

1857 ముస్లింలు.pdf

పొందిన సైనికాధికారిలా నగరంలోని తిరుగుబాటుదారులను కూడదీసుకుని, మన స్థావరాల మీద దాడి చేసి పోరాడుతూ పట్టుబడింది. ఆమె కడు ప్రమాదాకారి. జాగ్రత్త సుమా, అని పేర్కొన్నాడు.

ఈ లేఖను ఖుర్షీద్‌ ముస్తఫా రజ్వీ రాసిన జంగ్-యే-ఆజాది 1857 అను ఉర్దూ గ్రంథంలో ప్రచురించారని, భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామ్‌ మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ గ్రంథ రచయిత్రి డాక్టర్‌ ఆబిదా సమీయుద్దీన్‌ తన గ్రంథంలో (పేజి.45) వివరంగా ఉటంకించారు. ఆమెను అంబాల పంపుతూ ఈ వృధురాలు బహు ప్రమాదాకారి...జాగ్రత్త అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా

79