పుట:1857 ముస్లింలు.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు


lock ఆమెను కాల్చి వేయాల్సిందిగా సైనికులకు ఆదేశాలిచ్చాడు. ఆ ఆదేశాలను విన్న అజీజున్‌ చిరునవ్వుచిందిసూ, తుపాకి గుండ్లకు ఎదురుగా నిలబడ్డారు. బ్రిటిష్‌ సైనికుల తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఆ తుపాకుల్లో నుండి గుళ్ళు బయల్పడి ఆమె సుకుమార శరీరాన్ని ఛేదించుకుని దూసుకపోతుండగానే నానాసాహెబ్‌ జిందాబాద్‌ అంటూ ఆమె నినదించారు. ఆ సింహనాదాంతో ఆంగ్లేయ సెనికులు స్థాణువులు కాగా బేగం అజీజున్‌ ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి.

అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే ఆకుపచ్చ రంగు దుస్తుల వలన ఆమె ఆకుపచ్చ రంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటిష్‌ సైనికదళాలలో భయాత్పాతం సృష్టించారు. ఈ మహిళ సాహసాన్నిబేగమత్‌ కి అంశూఅను గ్రంథంలో రచయిత విస్తారంగా ప్రస్తావించారని తెలుపుతూ ఆ వివరణను భారత్‌కే స్వాతంత్య్ర సంగ్రామ్‌ మేౌ ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ అను పుస్తకంలో రచయిత్రి, అలీఘర్‌ ముస్లిం యూనివసిటి ఆచార్యులు డాక్టర్‌ అబిదా సమీయుద్దీన్‌ (పేజి.44లో) ఈ క్రింది విధంగా ఉటంకించారు

ఆ మహిళ అద్వితీయ ధైర్యశాలి. ఆమెకు మృత్యుభయం ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నాఅత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్ని సార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికొన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గ విన్యాసంలో, గురి తప్పకుండా తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది.

ఈ వర్ణన ద్వారా ఆమె గెరిల్లా పోరు సాగించేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికీ ఏమాత్రం తెలియకుండ తన బలగాలతో శత్రువు మీద దాడులు జరిపిన తీరు ఆమె గెరిల్లా రణతంత్రాన్ని స్పురణకు తెస్తుంది. ఆంగ్ల సైన్యాలతో పోరాడుతూ గాయపడి ఆమె శత్రువు చేతికి చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన సైనికాధికారి అంబాలాలోని ఆంగ్ల సైనిక స్థావరానికి పంపుతూ అంబాలా సైనిక స్థావరం డిప్యూటి కమీషనర్‌కు 1857 లై 29న లేఖ

78