పుట:1857 ముస్లింలు.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు.pdf

ప్రమాణ వాక్యం

డాక్టర్‌ ఇనుకొండ తిరుమలి

చరిత్ర శాఖ, శ్రీ వెంకటేశ్వర కళాశాల

ఢిల్లీ విశ్వ విద్యాలయం, కొత్త ఢిల్లీ

జ్ఞానకిరణమీ పుస్తకం


చరిత్ర రచన ప్రథానంగా దృక్పథానికి సంబంధించిందనేది నిర్వివివాదాంశం: అది గతాన్ని గూర్చిన మన ప్రస్తుత అవగాహన. మన గతం తాలూకు అవగాహననీ, దృక్పథాన్నీ వర్తమానం నిర్వచించి నిర్దేశిస్తుంది. ఎటువంటి భావజాల ప్రభావమూ లేకుండా. పూర్తిగా వస్తుగత దృష్టితో చరిత్ర రాస్తున్నాం అంటే సంకోచించాల్సిందే! 'పరిపూర్ణ' వస్తుగతతత్త్వ వాదుల రచనలు కూడ, కనీసం వారుపయోగించే పదాజాలం ద్వారానైనా, ఏదేనీ ఒక దృక్పథాన్ని, అవగాహననూ స్పురింపజేస్తాయి. భారత జాతీయవాదులు, కమ్యూనిస్టులు, యితరత్రా అనేకమంది తమ-తమ దృక్పథాలతో, తమ తమ భావజాల ప్రచారానికై చరిత్ర రచనా వ్యాసాంగాన్ని చేపట్టి కొనసాగించారు/సాగిస్తున్నారు. వివిధ విశ్వ విద్యాలయాలలో పుట్టుకొచ్చిన చరిత్ర యిందు కు భిన్నంగా ఏమీ లేదు. 'పాఠ్య పుస్తకాలు'గా మనవారు 'నిర్ణయించే' చరిత్రల స్వభావం మనమంతా ఎరిగిందే: రాజ్యభావజాల ప్రచారాస్త్రాలివి ! విశ్వ విద్యాలయాలలో గత రెండు-మూడు దాశాబ్దాలుగా జరుగుతున్న చరిత్ర బోధన, పరిశోధనలు 'పరిశోధన పరిశోధన కొరకే' నన్నట్లుగా, సమాజ అవసరాలతో సంబంధం లేకుండా తూ-తూ మంత్రంగా జరుగుతూ వస్తున్న విషాద వాస్తవం అష్టావక్రగా మనముందు సాక్షాత్కరిస్తోంది. విశ్వవిద్యాలయాలు సామాజికావసరాల పట్ల, ముఖ్యంగా అన్ని విధాలుగా అంచులకు నెట్టి వేయబడ్డ సబాల్టర్న్‌ (అట్టడుగు సామాజిక శ్రేణులు) ప్రజల అవసరాల పట్ల స్పందించకుండ, insensitive గా మారిపోయిన కఠోర సత్యాన్ని కొంత

5