పుట:1857 ముస్లింలు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 2 బేగం హజరత్‌ మహాల్‌

ప్రథమస్వాతంత్రోద్యమ సమరోజ్వల చరిత్రలో మహిళలు పురుషులతో ధీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఈ గడ్డ ఆడపడు చులు ఆత్మబలిదానానికి సిదపడ్డారు . విముక్తి పోరాట మైదానంలో శత్రువును సవాల్‌ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. యుద్ధ రంగంలో శత్రువుతో ముఖాముఖి తలపడిన సాహసోపేత సంఘటనలున్నాయి.

1857 మే 11న మీర్‌ నుండి తిరుగుబాటు యోధులు ఢిల్లీ చేరుకుని మొగల్‌ పాలకుడు బహదాూర్‌ షా జఫర్‌ ను చక్రవర్తిగా స్వీకరించి ఆంగ్లేయుల మీద పోరాటానికి శంఖారావం పూరించగానే చక్రవర్తి భార్య జీనత్‌ మహాల్‌ కూడా భర్త వెంట ముందుకు సాగారు. మొగల్‌ సింహాసనాన్ని ఆంగ్లేయుల పరం కానివ్వకుండా తన బిడ్డడు మీర్జా జవాన్‌ బక్త్‌కు కట్టబెట్టాలని ఆమె ఎంతో ఆరాటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యకిగత సంపదను పోరాటయోధుల కోసం వ్యయం చేశారు. తిరుగుబాటు యోధులకు ప్రధాన సైన్యాధికారిగా తన బిడ్డడు మిర్జా జవాన్‌ భక్త్‌ను నియమించమని కూడ ఆమె బహదాూర్‌ షా జఫర్‌ను కోరారు. ఆ తరువాతి కాలంలో ఆంగ్లేయుల తొత్తులైనటువంటి

71