పుట:1857 ముస్లింలు.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిముస్లింలు


ఆయన మీద పలు ఆరోపణలు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో సహజ న్యాయసూత్రాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆంగ్లేయాధికారులు ప్రవర్తించారు. ఆ సమయంలో జఫర్‌ సన్నిహితులు ఆయనను క్షమాబిక్ష కోరమంటూ సలహాలిచ్చారు. కుటుంబీకులందర్నీ కోల్పోయి, ముగ్గురు వారసులు బహిరంగంగా కాల్చి చంపబడి వారి తలలు నరకబడినా ఏమాత్రం చలించకుండ మొగల్‌ ప్రభువుల గౌరవానికి ఏమాత్రం భంగం కలుగని విధంగా సాహసోపేతంగా భగవంతుడికి ధన్యవాదాలు.తైమూరు వంశ సంతానం ఉజ్జfiలమైన ముఖాలతో తండ్రి దాగ్గరకి ఇలాగే వచ్చేవాళ్ళు అని వ్యాఖ్యానించి శత్రువును కూడ ఆశ్చర్యచకితులిfl చేసిన మొగల్‌ ప్రభువు అబూ జఫర్‌ సిరాజుద్దీన్‌

1857 ముస్లింలు.pdf

ఆంగ్లేయుల సైనికులచే విద్వంసానికి గురైన లక్నోలోని సికిందర్‌బాగ్ మహల్‌


ముహమ్మద్‌ బహదూర్‌ షాకు ఆ సలహా నచ్చలేదు. సన్నిహితుల సలహాలను పూర్తిగా తిరస్క రిస్తూ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్ లోని కవి ఎంతో ఆత్మ విశ్వాసంతో తిరుగుబాటు యోధుల హృదయాలలో రగులుతున్న ఆత్మగౌరవ జ్యోతులు ఏమాత్రం వెలుగును కోల్పోకుండా ప్రకాశిస్తూ ఉన్నట్టయితే ఒక రోజున లండన్‌ను ఇండియా కదిలించి వేయగలదు అని తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం రగిలించిన 69