పుట:1857 ముస్లింలు.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు

-మతాల ప్రజలు ఏకమై పాల్గొన్నారు.ఈ విషయాన్ని ఆంగ్లేయాధికారి థామస్‌ లోే (Tho- mas Lowe) తనదైన భాష-భావంలో శిశుహంతకులైన రాజపుత్రులు, మతమౌఢ్యులైన బ్రాహ్మణులు, మతదురభిమానులైన ముస్లింలు, విలాసవంత జీవితాన్ని ఇష్టపడుతూ పొట్టలు పెంచిన అత్యాశాపరులైన మరాఠాలు లక్ష్యసాధానకు ఒక్కటయ్యారు. గోవులను చంపువాడు - గోవులను ఆరాధించేవారు, పందిని అసహ్యయించుకొనేవారు, పందిని తినేవారు, అల్లాహ్‌ను ఖుదాగా, ముహమ్మద్‌ను ఆయన పైగంబర్‌గా భావింంచేవారు, బ్రహ్మ రహాస్యాలను కీర్తిస్తూ గానం చేసేవారు ఏకమై తిరగబడ్డారు, అని అసహనాన్ని వెల్లగ్రక్కాడు. ('The Infancticide Rajputs, the bigoted Brahman, the fanatic Mussalman, and the luxary loving fat pauched, ambitious Marathas had joined together in the cause, Cow killer and cow-worshipper, the pighater and pig-eater, the crier of 'Allah is one and Mohammed his Prophet' and the Membler of mysteries of Braham revolted conjointly' - Roots of Communalism In India, MKA Siddiqui, P.18)

ఈ విషయాన్ని ఆంగ్లేయసైనికాధికారి John william Kaye మరింత పరిపుష్టం చేస్తూ, వాస్తవం ఏమిటంటే ఇండియాలోని నల్లవారంతా తెల్లవారికి వ్యతిరేకమయ్యారు, అని అనగా, మరో ఆంగ్ల సైనికాధికారి Captain Hodson ఉన్నతాధికారులకు 1857 లై 26న పంపిన నివేదికలో ఇండియాలోని భారతీయ సైనికులు మాత్రమే కాదు యావత్తు దేశవాసులు తిరుగబడ్డారు, అని వ్యాఖ్యానించాడు. ఆ కారణంగా కొందరు ఆంగ్లేయులు కూడ 1857నాి పోరాటాన్ని సిపాయీల తిరుగుబాటు అని మాత్రమే అనటం ఉచితం కాదాన్నారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం సమయంలో ఇండియాలో బాధ్యతలు నిర్వహిస్తూ, భారతీయులతో, స్వదేశీ సైనికులతో పలు పోరాటాలు జరిపిన ఆంగ్ల సైనికాధికారులు John William Kaye, Thomas Lowe, Hodson తదితరులు ఈ పోరాటాన్ని సిపాయిల తిరుగుబాటు అనటం సరికాదని తాము రాసిన గ్రంథాలలో, తమ నివేదికలలో చాలా స్పష్టంగా పేర్కొనడాన్నిబట్టే మనం దాని స్వభావాన్ని అంచనా వేయవచ్చు.


నిజమైన జఫర్‌ కలలు

ఢిల్లీ పతనం తరువాత బహదూర్‌ షా జఫర్‌ను ఆంగ్లేయులు అరెస్టు చేసి 68