పుట:1857 ముస్లింలు.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు.pdf

అబ్బాదుల్లా
డైరెక్టర్‌
తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌
సందేశభవనం, లక్కడ్‌కోట్‌
ఛత్తాబజార్‌, హైదరాబాద్‌-2

ప్రచురణకర్త మాట

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ రాసిన గ్రంథాలను ప్రచురించటం మాకు సంతోషం కల్గిస్తుంది.ఈ గ్రంథాలను ఇటు సాధారణ పాఠకులు అటు పండితులూ ఆదరించటంతో ఈ అంశం విూద మరిన్ని గ్రంథాల రచనకు రచయిత సిద్ధం కాగా, ఆ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వరుసగా తెలుగు పాఠకులకు మేమందించాలనుకున్నాం.
ఆ క్రమంలో మా ఏడవ గ్రంథంగా 1857 ః ముస్లింలు వెలువరిస్తున్నాం. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 150 సంవత్సరాల సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం - ప్రజలు జరుపుకోవాలని నిర్ణయించిన సందర్భంగా మాతృభూమి విముక్తి పోరాటంలో అద్వితీయ త్యాగాలతో చిర్మరణీయులైన ముస్లిం యోధుల సాహస చరిత్రలను ప్రజల దృష్టికి తీసుకురావలని ఆలోచించాం. ఆ ఆలోచన మేరకు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రాసిన 1857 ః ముస్లింలు ప్రచురించాం. ఈ పుస్తకం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల మహోన్నత పాత్రను మన ముందు ఉంచుతుంది.
శతాబ్ధాలుగా కలసిమెలసి సహజీవం సాగిస్తున్న మనదేశంలోని వివిధ సాంఘిక జన సముదాయాలు తమ తమ పూర్వీకులు మాతృదేశ విముక్తి కోసం, ఆ తరువాత స్వంత గడ్డ ప్రగతీ-వికాసాల కోసం చేసిన త్యాగాలనూ, సాగించిన కృషినీ అన్ని ప్రజా శ్రేణులు పరస్పరం తెలుసుకుంటే ఒకరి పట్ల మరొకరికి గౌరవభావం కలుగుతుంది. ఆ గౌరవభావం నుండి జన సముదాయాల మధ్య మంచి సదవగాహన, సద్భావన పరిఢవిల్లుతాయి. ఆ సద్భావన నుండి సహిష్ణుత జనిస్తుంది. ఆ దిశగా మా ప్రయత్నాలలో భాగంగా తెలుగు పాఠకులకు ఈ గ్రంథాన్ని అందిస్తున్నాం.
- అబ్బాదుల్లా