పుట:1857 ముస్లింలు.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
1857:ముస్లింలు


మూలంగా ఈ ఓటమి కలిగింది...దుష్టులైన ఈ సంస్థానాధీశులు తమ స్వార్ధం కోసందేశాన్ని ఇంగ్లీషువారికి అప్పగించారు. లేకుంటే మన ఎదుట ఈ ఫిరంగులు ఏపాిటివి?అని వాపోయారు. (జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా...అమరవీరుల ఉత్తరాలు, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1998, పేజి.15)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం వార్తలను లండన్‌లోని 'టైమ్స్‌' పత్రికకు పంపడానికి ఢిల్లీ వచ్చిన పాత్రికేయు డు విలియం రస్సెల్‌ తన పత్రికకు సమాచారం పంపుతూ ఆనాడు పాటియాల, హర్యానాలోని జింద్‌ రాజుల సహకారం లభించకుండ ఉండి ఉన్నట్టయితే, శిక్కులను మన సెన్యంలో చేర్చుకోకుండ ఉన్నట్టయితే, ఢల్లీ ముట్టడి మనకు చాలా కషమయ్యేది. లక్నోలో శిక్కు సైనికులు మంచి సేవలందించారు. శిక్కులు మన సైనిక బలగాలకు మంచి బలాన్నిచ్చారు, అని 1858 మే 9న పత్రికలో వార్త రాశాడు. (Our Siege of Delhi would have been quite impossible if the rajahs (sic) of Patiala and of Jhind ( now known as Jindin Haryana) had not been our friends, and if the Sikhs had not recruited (in) our battalions, and remained quite in Punjab. The Sikhs at Lucknow did good service... as our armies were attending and strengthened by them in the field - ‘ Betrayal of the First War of Independence ' Prof. Shamshul Islam, The Milli Gazette, 16-31 May 2007, P.5)

ఈ విధగా ఆంగ్లేయులకు వత్తాసు గా నిలచి వారి విజయానికి, స్వదేశీ యోధుల పరాజయానికి కారణమై నందున ఆంగ్లేయాధికారులు కృతజతగా వ్యవహరించారు. ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి ఓడిన యోధుల ఆస్తిపాస్తులను, సంస్థానాధీశుల సంస్థానాలను, ఆంగ్లేయులు తమ తొత్తులకు సంక్రమింప చేశా రు. భారత దేశంలో తమకు తొత్తులుగా వ్యవహరిస్తూ, తమ పక్షాన నిలచినంత కాలం తామిక్కడ నిశ్చిం తంగా స్థిరపడి ఇక్కడి సంపదను దోచుకోవచ్చనీ, ఇక్కడి ప్రజలను యధేచ్ఛగా పాలించవచ్చనీ ఆంగ్ల పాల కులు భావించారు. అందుకు తగిన విధంగా నజరానాలు-బహుమతులు- బిరుదులతో తొత్తులను మరింత మచ్చిక చేసుకున్నారు. ఆ కారణంగా అలనాటి బ్రిటిష్‌ తొత్తులుగా మెలగిన సంస్థానాధీశులు అన్ని సుఖ భోగాలు అనుభవించారు. పలు బిరుదులను పొందారు. పోరుబాటన సాగిన యోధుల ఆస్తిపాస్తులను తమ సొంతం చేసుకోగలిగారు.ఆ తొత్తుల వారసులు కూడ వారసత్వంగా అన్ని భోగభాగ్యాలను అనుభ వించారు. ఆ అపార సంపద తెచ్చిపెట్టిన శక్తిసామర్థ్యాలతో ఆ తరువాత రాజకీయ60