పుట:1857 ముస్లింలు.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
1857: ముస్లింలు


ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ, ఈ పోరాటం దేశవాసుల ఉమ్మడి ప్రయోజనాల కోసం మాత్రమే ప్రారంభించామనీ తాను పాలకుడ్ని కావాలని మాత్రం కాదనీ అన్నారు. అయోధ్యా గద్దె మీదా అటు నవాబు వాజిద్‌ అలీషానూ, గోరఖ్‌పూర్‌ సంస్థానంలో ఇటు శ్రీ హన్మంత్‌ సింగ్‌ పాలననూ చూడలన్నది తమ ప్రధానాశయమని హసన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఆ లక్ష్యం కోసం ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధామయ్యారు. చివరకు ఆంగ్ల సైన్యాలు గోరఖ్‌పూర్‌ను చుట్టుమ్టుాయి. ఆ పోరాటంలో ఆంగ్ల సైన్యాలది పైచేయి కావడంతో ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత సైన్యాధికారులు నిర్వహించిన విచారణలో తనకు తన ప్రాణం కంటే స్వేచ్ఛా -స్వాతంత్య్రాలు ముఖ్యమని ముహమ్మద్‌ హసన్‌ ఖాన్‌ ప్రకటించారు.

ఈ విధగా వ్యకిగత ప్రయాజనాల కోసం కాకుండ ప్రజల ఉమ్మడి ప్రయాజనాల నిమిత్తం, స్వదేశీ పాలకుల కోసం, మతాల ప్రమేయం లేకుండ తమ ప్రభుభక్తిని ప్రకటించుకుంటూ ఆంగేయ సెన్యాలతో తలపడన ముసిం యోధులు, ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు. ఈ యోధులంతా పోరుబాట సాగి, మాతృభూమి పట్ల తమలో ఉన్న అంతులేని గౌరవాభిమానాలను ప్రకటిస్తూ, తమ సర్వసంపదాలతో పాటుగా ప్రాణాలను కూడ పణంగా పెట్టిశత్రువుతో పోరాడి షహీధులయ్యారు.

కలం యోధుల తోడ్పాటు

ప్రదమ స్వాతంత్య్రోద్యమంలో పర్షియన్‌, ఉర్దూ పత్రికలు బృహతరమైన పాత్రను నిర్వహించాయి. కంపెనీ పాలకుల చర్యలను తూర్పారాబడ్తూ, స్వాతంత్య్రసమర యోధులను ప్రోత్సహిస్తూ, తిరుగుబాటు సమాచారా న్ని ప్రజలకు తెలుపుతూ స్వదేశాభిమానం గల పత్రికల సంపాదాకులు, పాత్రికేయులు ప్రజలను తిరుగుబాటు దిశగా ప్రేరేపించారు. ఆనాడు ఢిల్లీ కేంద్రాంగానూ, ఇతర ప్రాంతాల నుండి 'ఢిల్లీ అక్బార్‌', 'కోహినూర్‌', 'తారిఖ్‌-ఎ-భగవత్‌-ఎ-హింద్‌ ', 'ముషిర్‌-ఎ-దాక్కన్‌', 'వకీల్‌ ' మున్నగు పత్రికలు ప్రజానీకంలో బ్రిటీష్‌ వ్యతిరేకతను సృష్టించడంలో సాహస వంతమైన, శ్లాఘనీయమైన పాత్రను పోషించాయి. ప్రథామ స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని నైతిక మద్దతునిస్తూ తిరుగుబాటు దార్లలో బ్రిటిష్‌ పాలకుల పట్ల తీవ్ర ప్రతిఘటన జ్వాలలను రగిలించింది 'ఢిల్లీ అక్బార్‌' పత్రిక. ఆ పత్రిక సంపాదకులైన మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌ను ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు అరెస్టు చేసి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. పరమ కిరాతకుడిగా

56