పుట:1857 ముస్లింలు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857 : ముస్లింలు


దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గుర్రం మీదస్వారి చేస్తూ, కత్తితో శత్రువు మీదా విరుచుకుపడుతూ ఆంగ్లేయ సైనికుల మీదా గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటీష్‌ సైనికదళాలలో భయాత్పాతం సృషించారు. శత్రువును సంహరిస్తూ తీవ్రంగా గాయపడిన తరువాత గాని పట్టుబడని ఆమెను అంబాలాలో గల బ్రిటీషు సైనిక స్థావరానికి పంపారు. ఈ సందర్భంగా 'ఈ వృద్దురాలు బహు ప్రమాదాకారి...తస్మాత్‌ జాగ్రత్త' అంటూ 1857లై 29న అక్కడి డిప్యూటి కమీషనర్‌ను హెచ్చరిస్తూ ఆమెను నిర్బంధించిన అధికారి ప్రత్యేకంగా లేఖ రాసి ముందు జాగ్రత్తలతో హెచ్చరికలు చేసాడంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతఘటికురాలో ఊహించవచ్చు.

శత్రువును సాయుధంగా ఎదుర్కొన్నవారు, సాయుధా తిరుగుబాటు దాళాలను ప్రోత్సహించిన వారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు ఉరిని కూడ లెక్కచేయని సాహసి హబీబా బేగం, ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి పోరాడుతూ ఆమెతోపాటుగా ప్రాణాలర్పించిన ముందార్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధాంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల క్షేమం కోరుతూ సజీవదహనమైన అస్గరీ బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమీలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసన సాహసి బేగం ఉమ్‌ద్దాలు వీరిలో కొందరు మాత్రమే !

ఆంగ్లేయులు ఈ మహిళల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించారు. ఆశ్చర్యపర్చే విధాంగా ధైర్యసాహసాలు ప్రదార్శించిన 11 మంది మహిళలను ఒక్కసారే ఉరికంబానికి ఎక్కించి బలి తీసుకున్న దారుణాలు ఎన్నో ఉన్నాయి. (Who is Who Indian Martyrs, Dr. P.N. Chopra, Govt. of India Publications, New Delhi.1973).

చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఫిుక జనసముదాయాలకు చెందిన మహిళలతోపాటుగా వేలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డరు, ఉరితీయబడ్డరు. సజీవ దాహనాలకు, అవమానాలకూ, అత్యాచా రాలకు బలయ్యారు. ఈ సమాచారాన్ని బ్రిీటీష్‌ అధికారుల డెరీలు, లేఖలు పచ్చిగా బహిర్గతం చేస్తున్నా యంటే, ఆ మహిళామణుల త్యాగాలు ఎంత మహత్తరమైనవో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.

50