పుట:1857 ముస్లింలు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళ వలసిందిగా ఆజ్ఞాపించాడు. అనుచరుల ఆయుధాలను తీసుకుని యడ్లబండిలో వేయించాడు. రాకుమారుల భద్రతకు ముప్పు లేదనుకున్న అనుచరులు వెనక్కు తగ్గగానే బండ్లను వేగంగా ఢిల్లీ వైపుకు పరుగులు తీయించాడు. ఆ విధంగా కొంత దూరం వెళ్ళాక రాకుమారులు ఉన్న బండిని ఆపించి ఆంగ్ల సైనికులు చుట్టుముట్టారు. కెప్టన్‌ హడ్సన్‌ ముందుకు వచ్చి రాకుమారుల బట్టలను ఊడదీయించి, వారిని నిరాయుధులను చేసి, కాల్చి చంపాడు. ఆ తరువాత రాకుమారుల మృతదేహాలను ఎడ్ల బండిలో వేసుకుని ఢిల్లీ నగరం ప్రధాన వీధుల గుండా తీసుకెడుతూ ప్రజలలో భయోత్పాతాన్ని కలిగించాడు. చివరకు చాంద్‌నీచౌక్‌ వద్దగల రాళ్ళగుట్టల విూద రాకుమారుల భౌతికకాయాలను గిరవాటు వేయించాడు. ఈ విధంగా పోరుబాటన సాగిన మొగల్‌ రాకుమారులను ఆంగ్లేయులు నిర్దాక్షిణంగా అంతం చేశారు.

ఆంగ్లేయులను సవాల్‌ చేసిన రాకుమారుడు


ఆంగ్ల సైన్యాల విూద తిరగబడి తొడగొట్టి సవాల్‌ చేసి నిలిచిన యోధులైన రాకుమారులలో మరొకరు ఫిరోజ్‌ షా. మొగల్‌ పాదుషా షా ఆలం మనుమడితడు. 1857లో మక్కా నుండి తిరిగి వచ్చిన ఆయన ఇక్కడ రగులుతున్న తిరుగుబాటు జ్వాల లను చూశారు. అందిన ఆయుధాన్ని చేతబూని ఆంగ్లేయుల విూద యుద్ధం ప్రకటించి 1857 ఆగస్టు 26న గ్వాలియర్‌ సంస్థానం మాండ్‌సోర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని 18 వేల మందితో స్వంత సైన్యం తయారుచేసుకుని ఆంగ్లేయుల విూద పోరాటాన్ని ఆరంభించారు.
కాన్పూరు నాయకుడు నానాసాహెబ్‌, అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహమ్మదుల్లా షా ఫైజాబాది లాంటి యోధులతో కలసి ఆంగ్ల సైన్యాల విూద ఉమ్మడి పోరు సాగించారు. స్వదేశీయులు ఆంగ్ల సైన్యాల విూద ఎక్కడ తిరగబడితే అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యారు. చివరకు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం సఫలం కాకపోవటంతో మిగతా తిరగుబాటు యోధులతో కలసి ఆయన అంతర్థానమయ్యారు. ఆయనను పట్టిచ్చిన వారికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ బహుమతి కూడా ప్రకటించింది. ఆంగ్లేయుల ఆధిపత్యానికి గండికొట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తూ, ప్రతికూల పరిస్థితులలో కూడా సంపద, సైన్యాల సవిూకరణకు కృషిచేస్తూ 1877లో అతి దుర్భరమైన