పుట:1857 ముస్లింలు.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ముస్లింలు


విూర్జా అబూబకర్‌ కూడా హుమాయూన్‌ సమాధి వద్ద ఉండగా ఆంగ్లేయాధికారి కెప్టన్‌ హడ్సన్‌ వారిని నిర్భంధించడానికి బలగాలతో సహా వచ్చాడు.
ఆ సమయంలో రాకుమారుల వద్ద సాయుధులైన మూడువేల మంది అనుచరులు ఉన్నారు. ఆంగ్ల సైనికులకు లొంగిపోవటం కంటె పోరాడి చావటం మేలని నిర్ణయిం చుకున్న రాకుమారులు తమ అనుచరులతోపాటుగా పోరుకు సిద్ధమయ్యారు. అప్పుడు హడ్సన్‌ వద్ద వందమంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీషర్ల తొత్తు, చక్రవర్తి వద్ద నమ్మినబంటుగా నిలచిన రాజవైద్యుడు హకీం హసనుల్లా ఖాన్‌ రంగప్రవేశం చేసి, ఈపోరాటం జరిగితే ఆంగ్లేయులకు నష్టం వాటిల్లగలదని భావించి, పోరాడకుండా లొంగిపోవాల్సిందిగా రాజకుమారులు సలహా ఇచ్చాడు. బేషరతుగా లొంగిపోయినట్టయితే వారి ప్రాణాలకు ముప్పురాకుండా ఆంగ్లేయాధికారులను ఒప్పించగలనని రాకుమారులను నమ్మించాడు.
{{Css image crop
|Image = 1857_%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%B2%E0%B1%81.pdf
|Page = 48
|bSize = 450
|cWidth = 339
|cHeight = 102
|oTop = 107
|oLeft = 59
|Location = center
|Description =
}}
ఆంగ్లేయుల తొత్తు హకీం హసనుల్లా ఖాన్‌ మాటలను విశ్వసించిన రాకుమారులు హుమాయూన్‌ సమాధి నుండి బయటకురాగా కెప్టన్‌ హడ్సన్‌ వారిని నిర్భంధించాడు. యడ్ల బండిలో రాకుమారులను ఢిల్లీకి తీసుకెళ్ళటం ఆరంభించాడు. రాకుమారుల అనుచరులు కూడా వెంట రావటం గమనించి వారిని వెనక్కు