పుట:1857 ముస్లింలు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహల్‌ చారిత్మ్రాక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో '... హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, సంపద అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీల విూద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు...హిందూ-ముస్లింలను హెచ్చరిస్తున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మబద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీకండి...మాతృ దేశం కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములవ్వండి. శత్రువుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి...' అని పిలుపునిచ్చారు.
హజరత్‌ మహాల్‌ విూద కత్తి గట్టిన ఈస్ట్‌ ఇండియా పాలకులు లక్నోను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏ మాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు. భారీ సంఖ్యతో చుట్టుముట్టిన బ్రిటీష్‌ సైనికమూకలను ఎదుర్కొనడం కష్టతరమైన తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు, తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగి నేపాల్‌ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో కాన్పూరు ప్రభువు నానాసాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాంటి యోధులను కలిసి ఆంగ్లేయుల విూద పోరు సాగించేందుకు బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, నేపాల్‌ అడవుల్లో సాహసి బేగం హజరత్‌ మహాల్‌ సామాన్య మహిళగా 1874లో కన్నుమూశారు.

విముక్తి బాటలో మొగల్‌ రాకుమారులు


స్వదేశీపాలకుల రాణులు మాత్రమే కాకుండా రాకుమారులు కూడా ప్రజలతో కలసి పరాయిపాలకుల విూద యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలో బహద్దూర్‌ షా జఫర్‌ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టగానే మొగల్‌ రాకుమారులు విూర్జా మొగల్‌, విూర్జా ఖైజర్‌ సుల్తాన్‌ తిరుగుబాటు యోధుల దళాలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కంపెనీ బలగాల విూద పోరుకు స్వయంగా నడుంకట్టారు. ఢిల్లీ పతనం తరువాత చక్రవర్తి తోపాటుగా విూర్జా మొగల్‌, విూర్జా ఖైజర్‌ సుల్తాన్‌లతోబాటు చక్రవర్తి మనుమడు