పుట:1857 ముస్లింలు.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ముస్లింలు

బ్రిటీష్‌ సైన్యంపై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు.
ఉత్తర భారతంలో అత్యంత సంపన్నమూ, కీలకమూ అయిన అవధ్‌లో తమ ఆధిపత్యానికి గండిపడడం సహించలేని కంపెనీ అధికారులు అవధ్‌ రాజధాని లక్నోను అపార సైనిక బలగాలతో చుట్టుముట్టి ప్రతీకారచర్యకు పూనుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితులలో ఏమాత్రం అధైర్యపడకుండా తన పదమూడు సంవత్సరాల బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా ఆమె అవధ్‌ రాజ్య పాలనా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను, ప్రజలను మతాలతో ప్రమేయం లేకుండా ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-ముస్లింలకు ప్రతిభను బట్టి సమాన స్థాయీ పదవులూ కల్పించారు; అధికారాలు ఇచ్చారు.
బ్రిటీష్‌ సైనికదళాల పడగ నీడలో కూడా ఎంతో సాహసంతో పలు మాసాల పాటు శత్రువు ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థ్ధవంతమైన పాలన సాగించారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఆంగ్లేయుడు విలియం రస్సెల్‌ '...బేగం మాతో అప్రకటిత యుద్ధ్దం ప్రారంభించింది... ఈ రాణులు, బేగంల శ్లాఘనీయ, శక్తివంత చరిత్రలను గమనించాక, అంత:పురంలో పర్దాల చాటున ఉంటూ కూడ ఎంతటి శక్తి యుక్తులు సంతరించుకోగలరో తెలుసుకున్నాం...' అని వ్యాఖ్యానించాడు. (Bharath Ki Swathantra Sangram Mien Muslim Mahilavonka Yogadan, Dr. Abeda Samivuddin, IOS, New Delhi, 1997 P. 42)
చరిత్రకారుడు H. Beveridge 1857 నాటి '..తిరుగుబాటుకు బేగం ఆత్మలాంటిది '. అని ప్రస్తుతించాడు( A Comprehensive History of India, H. Beveridge, 1887 Ed. Vol. III, P. 842. Quoted in Mr. Srivasthava Freedom Fighters of Indian Mutiny 1857, P.105)'...ఆమె పర్దానషీ మహిళ కానట్టయితే మిగతా పురుషుల కంటే గొప్ప పోరాట యోధురాలుగా ఖ్యాతి గడించేది...', అని ప్రముఖ చరిత్రకారుడు Abdul Haim Sharar వ్యాఖ్యానించాడు. (Quted in Freedom Fighters of Indian Mutiny 1857, Srivasthava, P.105).
ఈ సందర్భంగా విక్టోరియా రాణి ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో స్వదేశీ పాలకులనూ, సిపాయీలను ప్రజలనూ మంచి చేసుకునేందుకు పలు తాయిలాలు ప్రకటించింది. క్షమాబిక్ష ప్రసాదిస్తానని హావిూలు కుమ్మరించింది. ఆ ప్రకటనకు ప్రతిగా స్వదేశీపాలకులనూ, ప్రజలనూ హెచ్చరిస్తూ, ఆంగ్లేయుల కుట్రలను తేటతెల్లం చేస్తూ,