పుట:1857 ముస్లింలు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు

ఝాన్సీ రాజ్యానికి చెందిన జైళ్ళ అధికారి బక్షీష్‌ అలీ ఒకరు. 1857 జూన్‌ 6న ఆయన తన ఆధీనంలో ఉన్న స్వదేశీయులను జైలు నుండి విడుదల చేసి తిరుగుబాటుకు తెరలేపారు.
ఆనాడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తొలుత ఆంగ్లేయుల విూద తిరుగుబాటుకు అంగీకరించలేదు. ఆమె తొలిదశలో ఆంగ్లేయుల తోడ్పాటును ఆశిస్తూ 1857 జూన్‌ 12న ఆ తరువాత 14న WC Erskine కు రాసిన రెండు లేఖలో తిరుగుబాటు యోధులు తిరుగుబాటులో పాల్గొనాల్సిందిగా తన విూద ఒత్తిడి తెస్తున్నారని రాశారు. ఆ క్రమంలో 1858 జనవరిలో ఆంగ్లేయాధికారి F.D. Gordon కు ఆమె లేఖ రాస్తూ '..these
shortsighted individuals (the rebels) seem unmindful of the British supremacy and do their best to ruin myself and the whole country' (The Politics of a Popular Uprisings - Bundelkhand in 1857, Tapti Roy, OUP, 1994),, అని ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు విన్నవిం చుకున్నారు.
ఆ తరువాత కంపెనీ పాలకుల నుండి ఎదురైన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆమె కదనరంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు నచ్చచెప్పి రణరంగానికి రప్పించటంలో బక్షీష్‌ అలీ లాంటి ప్రముఖులు తమదైన పాత్ర వహించారు. చివరి వరకు బక్షీష్‌ అలీ ఆమె వెంట నడిచి ప్రాణాలర్పించారు. (Eighteen Fifty
Seven, Surendra Nath Sen, Govt. of India publications,1957, P. 283 ).

కదన రంగానికి కదిలిన స్వదేశీ పాలకులు


ఆంగ్లేయుల ఆర్థికబలాన్నీ, సైనికబలాన్నీ అత్యధికంగా అంచనా కడుతూ పరాయి పాలకుల ఎదుట మోకరిల్లకుండా వారి పెత్తనాన్ని ఏమాత్రం సహించకుండా చాలా మంది స్వదేశీపాలకులు తిరుగుబాటు పర్యవసానాన్ని పెద్దగా పరిగణించకుండా చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్‌ రాజ్యానికి నవాబైన వాజిద్‌ అలీషా సతీమణి బేగం హజరత్‌ మహాల్‌ ఆంగ్లేయుల విూద తిరుగుబాటు పతాకాన్ని విజవంతంగా ఎగురవేశారు. రాజ్య విస్తరణకాంక్షాపరులైన ఆంగ్లేయాధికారులు కుయుక్తులతో బేగం హజరత్‌ మహల్‌ భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను ఓ పథకం ప్రకారంగా ప్రజలలో అప్రతిష్ట పాల్జేసి, ఆయనను అరెస్టు చేసి, అవధ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన బేగం అవధ్‌ ప్రజలు, స్వదేశీయోధుల అండదండలతో