పుట:1857 ముస్లింలు.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ముస్లింలు
1857 ముస్లింలు.pdf


తీయలేదు....తన దేశాన్ని వశంచేసుకున్న విదేశీయుల విూద గౌరవప్రదమైన యుద్ధం చేశాడు. వీరుడుగా, నీతిమంతుడుగా గుర్తించబడిన ఆయన అన్ని దేశాలు గౌరవించదగిన యోధుడు..', అని ప్రశంసించాడు.
(‘If a patriot is a man who plots and fights for independence, wrongfully destroyed, of his native country, then the Moulvi was a true patriot...he had fought manfully, honourably and stubbornly in the battle field against the strangers, who had seized his country, and his memory is entitled to the respect of the brave and the true-hearted of all nations‘. The Indian Mutiny of 1857 : Colonel G.B. Malleson)

స్వదేశీ పాలకులను ప్రేరేపించిన యోధులు


ఆంగ్లేయుల అజేయశక్తిని ఊహించుకుని, తిరగబడితే ఎదురయ్యే పర్వసానలను లెక్కలు గట్టి కంపెనీ పాలకుల విూద తిరగబడటానికి చాలా మంది స్వదేశీ పాలకులు సంకోచించారు. ఆ తరుణంలో ఆయా పాలకుల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ముస్లిం యోధులు తమ తమ పాలకుల వెంట ఉండి మాతృభూమి విముక్తి కోసం తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకతలను వివరించి తాము స్వయంగా పోరుబాట పట్టడమే కాకుండా స్వదేశీపాలకులను కూడా ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ తరహా వీరులలో