పుట:1857 ముస్లింలు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశద్రోహానికి తలపడిన ఆ పోవెన్‌ పశువుకు 50 వేల రూపాయల పారితోషికం లభించింది!' అని రాశారు. (పేజి. 156-157)
మౌల్వీ ఖండిత శిరస్సును తెప్పించుకున్న అధికారులు ' ఉత్తర భారత దేశంలో బలిష్టమైన శత్రువును ' అంతం చేశామని ఆనందించారు. ఆ యోధుని శౌర్యప్రతాపాలను మాతృభూమి విూద ఆయనకు గల గౌరవాభిమానాలను ప్రస్తావిస్తూ బ్రిటీష్‌ సైనికాధికారి General Holems తన The Sepoy War అను గ్రంథంలో '...ఆక్రమంగా విధ్వంసం కాబడిన తన మాతృదేశ స్వాతంత్య్రం కోసం కుట్రపన్ని, యుద్ధ్దం చేసే మనిషి దేశభక్తుడు అయినట్లే మౌల్వీ తప్పకుండా నిజమైన దేశభక్తుడు. ఆయన ఖడ్గం హత్యలతో రక్తం రంగుపులుముకోలేదు. ఆయన హంతకులతో చేతులు కలుపలేదు. తన దేశాన్ని ఆక్రమించుకున్న పరాయి దేశస్థులకు వ్యతిరేకంగా రణరంగంలో పౌరుషంగా, గౌవరనీ యంగా, అకుంఠితంగా మొనగాడిలా యుద్ధం చేశాడు. ఆయన స్మృతి అన్ని దేశాల్లోని ధైర్యవంతుల, సహృదయులు శ్రద్దాంజలికి అర్హమైనది' అని ప్రస్తుతించాడు.
ఆ ఆంగ్లేయుడు అంతటితో ఆగలేదు. ఆ గ్రంథంలోనే మరొక చోట, A man fitted both his spirit and his capacity to support a great cause and to command a great army. This was Ahamadullah, the Moulivi of Fyzabad..’’ (Quoted in S.Abul Hasan Ali Nadvi, ‘ Muslims In India‘ at P. 107),అంటూ మౌల్వీ శక్తి సామర్థ్యాలను వివరించాడు.
బ్రిటీష్‌ చరిత్రకారుడు సర్‌ థామస్‌ సీటన్‌ 'అతనొక సమర్థుడైన గొప్ప వ్యక్తి... అకుంఠిత దీక్ష,అసమాన ధైర్యసాహసాలు గల తిరుగుబాటు నాయకులలో అగ్రశ్రేణికి చెందిన వాడు', అన్నాడు. (Sir Thomas Seaton described him to be a man of great abilities, of undaunted courage, of stern determination and by far the best soldiers among the rebels..’ - The Indian Mutiny of
1857,Colonel G.B. Malleson, London,1906, P.17 ).
మౌల్వీ అహమ్మదుల్లా షాతో పలు పోరాటాలు చేసిన కల్నల్‌ జి.బి.మాల్సన్‌, (G.B. Malleson) మౌల్వీ చర్యలను సమర్థిస్తూ '..తన దేశాన్ని ఆక్రమించుకుని ధ్వంసం చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా,కుట్రపన్ని, యుద్ధం చేసి,స్వాతంత్య్రం సంపాదించుకోవడం దేశభక్తి అయితే తప్పకుండా మౌల్వీ గొప్ప దేశభక్తుడు... ఆయన అమాయకుల ప్రాణాలు