పుట:1857 ముస్లింలు.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదికంటేె మరణం మేలని భావించిన ఆడపడుచులు కన్పించిన బావుల్లోకి, సవిూపంలోని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆత్మ హత్యలకు పాల్పడటంతో నగరంలోని ఏ బావి చూసినా స్త్రీల మృతదేహాలతో నిండిపోయి కన్పించాయని ఆంగ్లేయాధికారులు తమ గ్రంథాలలో వివరించారు. ఈ అఘాయిత్యాలు అకృత్యాలను బ్రిటన్‌లోని తమ వాళ్ళకు రాసుకున్న ఉత్తరాలలో, తాము రాసుకున్న డైరీలలో, ఉన్నతాధికారులకు సమర్పించుకున్న నివేదికలలో ఆంగ్లేయులు సోదాహరణంగా పేర్కొన్నారు. ఈ నివేదికలు చదివిన ఆంగ్లేయ ఉన్నతాధికారులు కూడా తట్టుకోలేనంతగా ఆ చర్యలు ఉన్నాయని, ఆ వివరాలను తెలుసుకున్న ఆ ఆంగ్లేయాధికారులే స్వయంగా తమ గ్రంథాలలో చెప్పుకున్నారంటే ఆంగ్లేయులు ఎంత క్రూరంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
{{Css image crop
|Image = 1857_%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%B2%E0%B1%81.pdf
|Page = 40
|bSize = 450
|cWidth = 330
|cHeight = 102
|oTop = 105
|oLeft = 65
|Location = center
|Description =
}}

ఎర్రకోట ప్రేరణతో వెల్లువెత్తిన తిరుగుబాట్లు


ఆంగ్లేయుల ఆధిపత్యానికి చరమగీతం పాడి ఢిల్లీలో బహదూర్‌ షా జఫర్‌ చక్రవర్తిగా అధికార పగ్గాలు చేపట్టారని తెలియగానే దేశవ్యాప్తంగా తిరుగుబాటు జ్వాలలు రగిలాయి. పరాయి పెత్తనం క్రింద నలుగుతున్న స్వదేశీ పాలకులు, ప్రజలు, స్వదేశీ సైనికాధికారులు, సైనికులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. తమ