పుట:1857 ముస్లింలు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు

ప్రజల విూద విరుచుకపడ్డ ఆంగ్ల సైనికులు

అప్రతిహతంగా సాగుతున్న తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన స్వదేశీయోధుల విూద, ఆ యోధులకు సహకరించిన ప్రజల విూద ప్రధానంగా ఢిల్లీ ప్రజల విూద ఆంగ్లేయ సైన్యాధికారులు, సైనికులు విరుచుకుపడ్డారు. బహదూర్‌ షా జఫర్‌ను బంధించారు. మొగల్‌ వారసులెవ్వరూ బ్రతికి బట్టకట్టరాదన్న లక్ష్యంతో ఆయన కుటుంబీకులను ఆడ-మగ, పిల్లా-పాప, వృద్ధులు అని చూడకుండా ఊచకోతకోశారు. జఫర్‌కు ఇచ్చిన మాటతప్పి నిరాయుధులైన మొగల్‌ రాకుమారులను బహిరంగంగా కాల్చి చంపి మృతదేహాలను ఎర్రటి ఎండలో బండరాళ్ళ విూద గిరవాటు వేశారు.

ఆ రాకుమారుల మృతదేహాల నుండి వారి శిరస్సులను వేరు చేశారు. ఆ శిరస్సులను ఒక పళ్ళెంలో పెట్టి, దానిపై రుమాలు కప్పారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ విూకు ఇవ్వకుండా ఆపివేసిన నజరానా ఇదిగో అంటూ బహద్దూర్‌ షా జఫర్‌ ఎదుటకు తెచ్చి, శిరస్సుల విూద ఉన్న రుమాలు తొలగించారు. ఆ ఘోరకలి చూసిన బహదూర్‌ షా జఫర్‌ తన ఎదుటకు తన కుమారుల కంఠిత శిరస్సులను పళ్ళెంలోపెట్టి తెచ్చిన ఆంగ్లేయాధికారి హడస్సన్‌ కు సమాధానమిస్తూ భగవంతుడికి ధన్యవాదాలు. తైమూరు వంశ సంతానం ఉజ్జ్వలమైన ముఖాలతో తండ్రి దగ్గరు ఇలాగే వచ్చేవాళ్ళు అని సమాధాన మిచ్చాడు. (భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర, ప్రచురణ కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమర యోధుల సంఘం, విజయవాడ, 1984, పేజీ. 24)

ఆంగ్ల సైనికులు ఢిల్లీ నగరాన్ని స్మశానం చేశారు. ప్రజలను, ప్రధానంగా ముస్లింలను, నగరంలోనికి ఆరు మాసాల దాకా రాన్విలేదు. నగరంలో ఉన్నవారెవ్వరిని బయటకు పోనియ్యలేదు. నగరంలో తమ మానాన తమను బ్రతకనివ్వలేదు. అన్ని ముస్లిం వాడల విూద భయానక దాడులు చేశారు. ప్రత్యేకంగా ప్రతి ముస్లిం గృహాన్ని గుర్తించి గృహస్థులను దారుణంగా కాల్చి చంపుతూ, ఆస్తిపాస్తులను దోచుకున్నారు. భవనాలను అగ్నికి ఆహుతి చేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఆంగ్లేయ సైనికులు, అధికారులు వారాల తరబడి నగరంలోని ప్రతి ఇంటిని దోచుకున్నారు. అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ కిరాతక చర్యవలన ఢిల్లీ నగరం పూర్తిగా శవాల దిబ్బగా మారిపోయింది. ఢిల్లీలోని ప్రతి గృహం, ప్రతి వీధి మృతదేహాలతో నిండిపోయింది.

మహిళల విూద యధేచ్ఛగా సాగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు అవకాశం లేకపోవటంతో ఆంగ్ల సైన్యాల చేతుల్లోపడి తమ మానమర్యాదలను కొల్పోవటం

36