పుట:1857 ముస్లింలు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

that their cause was ruined by dissolute and incompetent princes, and by
cowards and traitors.' P. 429 ).
ఆంగ్లేయుల ఆధిపత్యానికి తొలిదశలో చరమగీతం పాడిన ఈ నాయకుడు తన అనుచరులతో కలసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు గుండెలో దడ పుట్టించాడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ చివరి దశలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల సమయంలో బహదూర్‌ షా జఫర్‌ కనుక భక్త్‌ఖాన్‌ సలహాను పాటించి ఆయనతోపాటుగా లక్నో వెళ్ళిఉంటే భారతదేశ చరిత్ర మరోలాగుండేదని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ విశ్లేషకులు అభిప్రాయపడ్డారంటే ఆయన ముందుచూపు ఏలాంటిదో గ్రహించవచ్చు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం చివరి దశలో ఎర్రకోట వీడిన ఈ యోధుడు ఆ తరువాత పలు ప్రాంతాలలో ఆంగ్లేయ సైనికులతో తలపడుతూ చివరకు 1859లో కదనరంగాన కన్నుమూశాడు. అత్యంత ప్రతిభావంతుడైన ఆ యోధుని గురించి జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రస్తావిస్తూ, బహదూర్‌ షా జఫర్‌ స్వాతంత్య్రసంగ్రామానికి తల, హిందూ-ముస్లింలు కాళ్ళూచేతులయితే, భక్తఖాన్‌ మెదడు లాంటి వాడని ప్రశంసించారు.
(‘ If Bahadur Sha Zafar was head of the freedom struggle and Hindus and
Muslims were legs and hands, then Bhakth Khan was the brain ‘ - Muslims in First War of Independence, Radiance Views Weekly, 31 August
- 6 September 2003, Page. 24)

జఫర్‌కు అండదండగా స్వదేశీ పాలకులు


ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మొత్తం విూద 72 సార్లు పలు ప్రాంతాలలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికులతో స్వదేశీ యోధులు తలపడ్డారు. ఈ పోరాటంలో ఫరూఖాబాద్‌ యోధులు అహమ్మద్‌ అలీ ఖాన్‌, తఫ్‌జుల్‌ హుస్సేన్‌ సరత్‌ జంగ్‌ తదితరులు మొగల్‌ పాదుషాకు ఆయుధాలు, ఆహార సామగ్రి అందించి అండదండలుగా నిలిచారు. ఆ కారణంగా అహమ్మద్‌ అలీ ఖాన్‌ను అరెస్టు చేసిన ఆంగ్లేయులు చాంద్‌నీచౌక్‌లో బహిరంగంగా ఉరితీసి శవానికి అంత్యక్రియులు కూడా జరుపకుండా ఎర్రకోట కందకం లోకి విసిరిపారేశారు. నవాబు తఫ్‌జుల్‌ హుస్సేన్‌ సరత్‌ జంగ్‌ను పలు హింసలకు గురిచేసి చివరకు ప్రవాసశిక్ష విధించారు.
ఆనాడు మొగల్‌ పాదుషా వెంట సాగిన వారందరికి వారెంతటి స్థానంలో