పుట:1857 ముస్లింలు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చివరకు ఈ పాలనా మండలిలోని సభ్యులు కూడా తమ చర్యలకు బాధ్యత వహించాలని నిర్ణయమైంది. అవినీతికీ అక్రమాలకూ పాల్పడితే మండలిలో చర్చించి, నిందితునికి సమాధానం చెప్పుకునే అవకాశం కల్పించి ఆ తరువాత తగిన చర్యలు తీసుకోవాలని విధాన నిర్ణయపత్రం పేర్కొనటం విశేషం.

ఈ వ్యవస్థ గురించి ప్రముఖ చరిత్రకారుడు M. Mujeeb తన గ్రంథం Indian Muslims (P. 426-429) లో వివరంగా చర్చించారు. ఆధునిక భారత దేశ చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామిక రాజ్యాంగ విధానాన్ని రూపొందించటం జరిగిందని M. Mujeeb తిరుగుబాటు యోధులు ప్రతిపాదించిన వ్యవస్థను ప్రశంసించారు.

1857 మే10 సాయంత్రం మీరట్‍లో సమరశంఖారావం పూరించి , అక్కడి ఆంగ్లేయ అధికారుల భరతం పట్టి,
ఎర్రకోట మీద స్వతంత్ర పతాకాన్ని ఎగరేసేందుకు ఢిల్లీ దారి పట్టిన స్వదేశీ సైనిక బృందాలు
(' First instance in the history of Modern India, when Democratic Constitutional proceedure is devised..'. P. 429 ).
సర్వసేనాని భక్త్‌ఖాన్‌, ఆయన అనుచరులు ప్రజాస్వామిక పద్ధతులలో పరిస్థితు లను చక్కదిద్దేందుకు యత్నించినా, ఈ వ్యవస్థ అసమర్థులైన రాజకుమారులు, పిరికి పందలు, విద్రోహుల కారణంగా విఫలమైందని M. Mujeeb ఆవేదన వ్యక్తంచేశారు (‘Bhakth Khan and his comrades, who sought to obtain control of premature and unplanned military uprising did have in them the makings of just and democratic rulers and organizers and it was tragic indeed