పుట:1857 ముస్లింలు.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని వివరిస్తున్న సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ చరిత్ర గ్రంథాలు

భారత స్వాతంత్య్రోద్యమం...ముస్లింలు భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లిం జన సముదా యాల త్యాగాల చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తుంది. 1757 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన ప్రధాన ఘట్టాలలో ముస్లింల పాత్రకు సంబంధించిన విలు వైన సమాచారాన్ని క్లుప్తంగా చిత్రపాలతో సహా అందిస్తుంది. (తృతీయ ప్రచురణ, 1/8 డెమ్మీ సైజు, పేజీలు ó 72, మల్టికలర్‌ టైిల్‌, వెల.. 25)

మైసూరు పులి టిపూ సుల్తాన్‌ బ్రిటిష్‌ పాలకుల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను ఆదిలోనే గ్రహించి స్వదేశీ పాలకులను హెచ్చరించడమే కాకుండా, జీవిత చరమాంకం వరకు పరాయిపాలకులతో పోరాడిన తొలితరం జాతీయవాది, మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌ జీవిత చరిత్రను విలువైన చిత్రాలు, ఫొటోలతో ఆవిష్కరిస్తుంది. (తృతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు. 69, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 25)


షహీద్‌-యే-ఆజం అష్పాఖుల్లా ఖాన్‌ సర్దార్‌ భగత్‌సింగ్ కు స్పూర్తిగా నిలచిన విప్లవకారుడు, స్వాతంత్య్రోద్యమంలో సంచలనం సృష్టించిన 'కాకోరి రైలు' సంఘటనలో ప్రధాన పాత్ర పోషించి, 27 ఏండ్ల వయస్సులో ఉరిశిక్షను ఆనందంగా స్వీకరించిన యోధుడు అష్పాఖుల్లా ఖాన్‌కు సంబంధించిన ఫొటోలతో కూడిన చరిత్రను తెలియపరుస్తుంది. (ద్వితీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు ó 72, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 25)

భారత స్వాతంత్య్రోద్యమం....... ముస్లిం ప్రజాపోరాటాలు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా 1765 ప్రాంతం నుండి సాగిన ప్రజా పోరాటాలలో ప్రధానమైన బెంగాల్‌ సన్యాసులు-ఫకీర్ల ఉద్యమం, వహాబీ యోధుల తిరుగుబాట్లు, ఫరాజీ వీరుల విజృం భణ, మలబారు మొప్లాల వీరోచిత పోరాటం, ఖుదా-యే-ఖిద్మత్‌ గార్ల అహింసోద్యమ అద్బుత చరిత్రలను వెల్లడిస్తుంది. (ద్వెతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు:168, మల్టికలర్‌ టైటిల్‌, వెల: 100)

301