పుట:1857 ముస్లింలు.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సామరస్యం మరింతగా పటిష్టమౌతుంది. శాంతి-సామరస్యాలతో విలసిల్లుతున్న సమాజంగాని, దేశంగాని నిరాటంకంగా అభ్యున్నతి దిశగా సాగిపోతుంది.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ శంఖారావం


ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ శంఖారావాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ కొలువులో ఉన్న భారతీయ సైనికులు బెంగాల్‌లోని బరహంపూర్‌లో (Berhanpore) పూరించారు. ఈ తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం ఆంగ్లేయ సైనికాధికారులు ప్రవేశపెట్టిన కొత్తరకం తూటాలు కావటం విశేషం. ఈ తూటాలకు ముస్లింలు అవిత్రమైన జంతువుగా పరిగణించే పందులు, హిందువులు పవిత్రంగా భావించే గోవుల నుండి తీసిన కొవ్వును పూయటం జరిగింది. ఆ తూటాలను ఉపయోగించాలంటే తప్పనిసరిగా ఆ కొవ్వును నోటితో కొరకాల్సి వస్తుంది. ఆ కారణంగా తమ విశ్వాసాలకు విఘాతం కల్గించే నూతన తూటాల వాడకం వలన మత భ్రష్టత్వం, కుల భ్రష్టత్వం తప్పదని సిపాయీలు భావించారు.
ఆంగ్ల సైనికాధికారులు కొత్త తూటాలను తప్పనిసరిగా వాడాలంటూ బలవంత పెట్టడంతో సిపాయీలు ఆగ్రహించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని 19వ దళం సిపాయీలు నూతన తూటాలను వాడాల్సిందే నంటూ ఆంగ్లేయాధికారులు జనవరి 1857 లో హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలను స్వదేశీ సిపాయిలు పాటించ ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయాధికారుల ఆజ్ఞలను 1857 ఫిబ్రవరి 26న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌ సవిూపానగల బరహంపూర్‌లో సైనికులు అమలు చేయ నిరాకరించారు.ఆంగ్లేయుల ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ తూటాల వాడకానికి ససేమిరా అన్నారు.
సిపాయీల మత విశ్వాసాలను ఏమాత్రం లెక్కచేయని అధికారులు తూటాల వాడకం తప్పనిసరని ప్రకటించారు. ఆ వాతావరణంలో క్రైస్తవ మతస్థులైన ఆంగ్లేయులు తమను ఉద్దేశ్యపూర్వకంగా మతభ్రష్టుల్ని చేయాలనుకుంటున్నారని సిపాయీలు భావించారు. ఆ కారణంగా తమ విూద ఒత్తిడి తెస్తున్న ఆంగ్లేయాధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహ వ్యక్తీకరణలో భాగంగా కలకత్తాకు సవిూపాన బారక్‌పూర్‌లోని కంపెనీ సైనిక స్థావరానికి చెందిన 34వ స్వదేశీ సైనిక దళంలోని మంగళ పాండే మార్చి 29న సౖౖెనికాధికారుల విూద కాల్పులు జరిపారు. ఈ చర్యతో మండిపడిన ఆంగ్లేయాధికారులు మంగళ పాండే విూద సైనిక విచారణ జరిపి ఆయనకు 1857