పుట:1857 ముస్లింలు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశంలోని హిందూ-ముస్లిం జనసమూహాల మధ్య సద్భావనకు, సదవ గాహనకు యిలాంటి పరిణామాలే ఆటంకంగా మారి క్రమక్రమంగా ఆయా జనసముదాయాల మధ్య మానసిక ఎడం ఏర్పడటానికి ప్రధానం కారణమవుతున్నాయి. ఈ అగాథాన్ని మరింత పెంచి పోషించి ఒక సాంఘిక జనసమూహానికి ఏకైక ప్రతినిథులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న రాజకీయ మతోన్మాదశక్తులు -వ్యక్తులు ఈ అవాంఛనీయ వాతావరణాన్ని బాగా వాడుకుంటున్నాయి.
ముస్లింలకు సంబంధించిన చరిత్రను మరింతగా వక్రీకరించి ముస్లిమేతర ప్రజల్లో అపోహలను-అపార్థాలను సృష్టిస్తున్నాయి. ఈ దుష్ప్రచారాన్ని చాలా పకడ్బందీగా కొనసాగిస్తూ కొంత మేరకు విజయం సాధించాయి. ఈ అసత్యప్రచారం ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే ముస్లిమేతరులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా తమ పూర్వీకుల త్యాగాల పట్ల అజ్ఞానాన్ని వ్యక్తం చేసేంత స్థాయి వరకు సాగింది.

అపూర్వ త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి


ఈ అవాంఛనీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. భారత దేశంలోని అన్ని సాంఘిక జనసముదాయాల త్యాగాలు ప్రతి ఒక్క సముదాయానికి తెలియాల్సి ఉంది. బహుళ సంస్కృతీ సభ్యతలతో విలసిల్లుతున్న పలు సాంఘిక జనసముదాయాల గడ్డ అయినటుంటి ఇండియాలోని జనసముదాయాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి చరిత్రలో ఆయా సమూహాలు నిర్వహించిన పాత్ర ఆ ప్రత్యేక సమూహానికి మాత్రమే కాకుండా ఇతర సముదాయాలకు కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది.
భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వాన్ని అంతర్వాహికగా అంగీకరిస్తూ, కలసిమెలసి నివసిస్తున్న బహుళ సముదాయాలకు మాతృభూమి సేవలో పునీతమైన జనసముదాయాల పాత్ర, ఆయా త్యాగాల చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే వివిధ జనసముదాయాల మధ్యన పరస్పరం గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం ద్వారా ప్రేమాభి మానాలు స్థిరపడతాయి.
ఆ వాతావరణం భిన్న సముదాయాల మధ్య సదవగాహన, సద్భావన, సహిష్ణుతకు పునాది అవుతుంది. ఈ వాతావరణంలో మాత్రమే లౌకిక వ్యవస్థ పరిఢవిల్లు తుంది. ఈ సానుకూల మానసిక స్థితిలో మత విద్వేషాలు మట్టిలో కలసి శాంతి-