పుట:1857 ముస్లింలు.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


దళిత సమస్య మాత్రమే కాదు సతీ సమగమనం కూడా ఇస్లాంమతావలంభీకులు ఈ దేశంలో ప్రవశించిన తరువాత ముస్లింల కాముకత నుండి తమ బిడ్డలను, మహిళలను రక్షించుకునేందుకు వచ్చిందన్న ప్రచారం కూడా సాగుతుంది. ఈ ధోరణిలో పర్దా పద్దతి కూడా ముస్లిం రాజుల విశృంఖల శృంగారేచ్ఛ కారణంగా అమలులోకి వచ్చిందని బలంగా ప్రచారం గావిస్తూ ముస్లింల మీద తమ మురికి బురదను కొందరు చల్లుతున్నారు.

సామాన్య ప్రజానీకం మాత్రమే కాదు బాగా చదువుకున్న వ్యక్తులు, ప్రముఖ పండితులు సైతం ఇటువంటి అసత్య ప్రచారానికి లోనవుతున్నారు. బహుళ రీతులలో బహుమార్గాలలో, బహువర్గాలలో సాగుతున్న అసత్యాల ప్రచారం వలన చరిత్రకు సంబంధించి లోతైన అవగాహన లేని ప్రముఖులు కూడా తేలిగ్గా అసత్యాలను సత్యాలుగా నమ్మటం వలన ఆ విషయాలను వ్యాఖ్యానిస్తూ చేస్తున్న ప్రకటనలు కూడా ముస్లిమేతర ప్రజలలో ముస్లిం వ్యతిరేకత మరింతగా బలపడడానికి పరోక్షంగా తోడ్పడుతున్నాయి. సామాన్య ముస్లిం జనసముదాయాలు కూడా ప్రముఖుల ప్రకటనలను, పలుకులను అక్షర సత్యాలుగా నమ్మి తమ పూర్వీకులు పాపాలు చేశారని భావిస్తూ అత్యన్యూన్యతా భావనకు, ప్రదానంగా అపరాధ భావనకు లోనవుతున్నారు. నకారాత్మకమైన ఈ భావనల మూలంగా తమకు జరుగుతున్నఅన్యాయ్యాన్ని కూడా ప్రశ్నించలేకపోతున్నారు.

భారత ప్రప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా ఈ దుష్ప్రచారానికి లోనయ్యారు. ఆమె రాష్ట్రపతిగా ఎంపిక కాకముందు రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌ లో 2007 న్‌ 17న జరిగిన మహారాణా ప్రతాప్‌ 467వ శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియాలో పర్దా పద్ధతి మొగలుల పాలనా కాలంలోనే మొదలయ్యిందనీ, ఆక్రమణదారులైన మొగలుల బారిన పడకుండా మహిళలు తమను తాము కాపాడుకోడానికే ఈ పరదా పద్ధతి పాటించటం మొదలు పెట్టారు, అని అన్నారు.

ఈ వ్యాఖ్యల ద్వారా స్థూలంగా ఇండియాలోనూ, సూక్ష్మంగా రాజస్థాన్‌ లోనూ పర్దాపదతికి కారణం మొగల్‌ ప్రభు వులన్నచారిత్రక అవాస్తవాన్ని ఆమెకు తెలియకుండానే ప్రజలకు చేరవేశారు. ఈ పర్దా పద్ధతి మొగలుల రాక కంటే కూడా పురాతనమైనదని, ఇది ఇండియాలో మొగలులు రాకముందునుండే ఉందన్న వాస్తవ చరిత్రను ఆమె గ్రహంచలదు . ప్రస్తుతం మొగలులు లేకున్నా ఇండియాలోని పలు ప్రాంతాలలో హిందూ-


283