పుట:1857 ముస్లింలు.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ప్రపంచంలో ఎక్కడా కన్పించనీ ఇండియాలో మాత్రమే శతాబ్దాదాలుగా దర్శ నమిచ్చే అంటరానితనం, మహిళలు అనుసరించు పర్దా పద్ధతికీ, బాల్య వివాహాలకూ, సతీ సహగమనానికీ ముస్లిం పాలకులు, ముస్లింల దుష్టపాలన, ముస్లిం సంస్కతి ప్రదాన కారణమని నమ్మించడానికి ప్రయత్నాలు బహుముఖంగా జరుగుతున్నాయి. ఏ మార్గం ద్వారానైతేనేమి రాజ్యాధికారం చేపట్టాలన్న తృష్త్ణతో మతోన్మాద స్వార్ధపర రాజకీయ శక్తులు తమ చర్యల ద్వారా ముస్లిం వ్యతిరేక మనస్తత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని చాలా నిస్సిగ్గుగా పటిష్టమైన పథకం ప్రకారంగా సాగిస్తున్నాయి. భారత దేశంలోనికి ముస్లింలు ప్రవేశించిన తరువాత మాత్రమే అంటరానితనం ప్రబలిందని చారత్రిక అవాస్తవాల్ని అసలుసిసలైన వాస్తవాలుగా పదే పదే చెబుతు ప్రచారంలో పెడుతున్నారు.

1995 న్‌ 15న విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ వారణాశిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ Dalits were the creation of Non- Hindutva forces, which ruled this country before the British...I say that Untouchability is a creation of Islam ఆని ప్రక ంచారు. (The Hindustan Times,16 June, 1995 and The Sunday Observer, July 30-August 5, 1995)

అంటరానితనం, దళితుల ఆవిర్భావం ఎవరి వల్ల, ఏ శక్తులు వల్ల, ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయో స్వయంగా హిందూ ధార్మిక గ్రంథాలు ఒకవైపు ఘోషిస్తుండగా ఆ సత్యాన్నిమరుగున పర్చి ముస్లిం వ్యతిరేకతను మరింతగా రచ్చగొట్టేందుకు శరపరంపరగా సాగుతున్న దుష్ప్రచారంలో భాగమిది.

ఈ దుష్ప్రచారాన్ని ప్రముఖ రచయిత ఇంతిజార్‌ నయీమ్‌ (Intizar Nayeem) తన Dalit Samsya : Jad Main Kaun (హింది) అను గ్రంథంలో సమాధానం ఇచ్చారు. సాహిత్య స్ధరభ్‌ (న్యూఢిల్లీ) 1996లో ప్రచురించిన ఈ గ్రంథంలో దళితుల సమస్యకు, అంటరానితనానికి కారకులెవ్వరన్న విషయాన్ని హిందూ మతానికి చెందిన పలు ధార్మిక గ్రంథాలు, ముస్లిమేతర రచయితలు, కవులు రాసిన పలు గ్రంథాలలో ఈ సమస్య ఆవిర్భావం గురించిన వెల్లడించిన వాస్తవాలను ఉటంకించారు. రెండు వందల తొంభైయిదు పుటల ఈ గ్రంథంలో ఎక్కడ కూడా ముస్లిం రచయితల ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఉదహరించడంగాని, ఉటంకించడంగానీ చేయకుండా, హిందాూ సమాజంలోని కొన్ని స్వార్థపరశక్తులు మనుషులలో ఉచ్ఛనీచాలను ఏవిధమ్గా సృష్టించింది స్పష్టంగా పేర్కొన్నారు.

282