పుట:1857 ముస్లింలు.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు


ఖండించి, దాని పై గుడ్డ కప్పుకొని చేరువనే 13 మైళ్ళ దూరాన ఉన్న బ్రిటిషు ఠాణా- షాజహన్‌పూరుకు తీసుకువెళ్ళారు...రక్తం ఓడుతున్న ఆ పవిత్ర శిరాన్ని ఆ నీచులు ఆంగ్లేయుల ముందు కానుకగా ఉంచి వారి పాదాల చెంత మోకరిల్లారు..నీచమైన దేశద్రోహానికి తలపడిన ఆ పోవెన్‌ పశువుకు 50 వేల రూపాయల పారితోషికం లభించింది! అని ఆగ్రహంచాడు. (1857 స్వరాజ్య సంగ్రామం, వినాయకరావు దామోదర్‌ సావార్కర్‌, అనువాదం: విజయ, నవయుగ భారతి ప్రచురణలు, హైదారాబాదు, 2001, పేజీ156).

ఈ విధంగా మాతృభూమి విముక్తి కోసం మౌల్వీ అకుంఠిత దీక్షతో సాగించిన పోరాటాన్ని, ఆయనలోని అద్వితీయ శక్తిసామర్థ్యాలను బ్రిటిష్‌ సైనికాధికారులు, చరిత్రకారులు స్వయంగా సాక్షాత్కరింపజేశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పలువురు మౌల్వీలు ఆంగ్ల సైన్యాలతో తలపడి ప్రాణాలు అర్పించారు. ఆ తరువాత భయానక చిత్రహింసలకు, ఉరితీతలకు, ఫిరంగి ప్రేలుళ్ళకు, తుపాకి కాల్పులకు పెద్ద సంఖ్యలో మౌల్వీలు గురయ్యారు. ఈ యోధులు ఇస్లామిక్‌ పండితులైనంత మాత్రాన వారి పోరాటం మతం కోసం మాత్రమేననటం దుస్సాహసం కాగలదు.

అంతటి దుస్సాహసం ఇటీవల కాలంలో Biman Bihari Majundar అను రచయిత చేశారు. ఆయన Militant Nationalism in India and its SocioReligious Background అను తనగ్రంథం ప్రసురిస్తూ దానిలో ప్రముఖ జాతీయోద్యమకారులు మౌల్వీ ఒబైదుల్లా సింధీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో ఆయుధం చేతబూని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలను ఎదుర్కొన్న ప్రముఖులు 1857 పోరాటం తరువాత ఆయుధాల స్థానంలో ఆంగ్లేయులతో మేధోపరమైన యుధం సాగించేందుకు అవసరమైన సైనికులను తయారు చేయాలనుకున్నారు. ఆ ఉద్దేశ్యంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పడిన దియోబంద్‌ విద్యా సంస్థకు చెందిన విద్యార్థి మౌల్వీ ఒబైదుల్లా సింథీ. జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా ముహ్మదుల్‌ హసన్‌ శిష్యుడిగా గురుపు అజ్ఞానుసారం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి 1915లో ఆఫ్గనిస్థాన్‌కు వెళ్ళి 1916లో రాజా మహేంద్ర వర్మ, బర్కతుల్లా భోపాలి తదితరులతో కలిసి ప్రప్రథమ ప్రవాస భారత ప్రభుత్వాన్ని కాబూల్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

277