పుట:1857 ముస్లింలు.pdf/271

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

రాసారు. దీనినిబట్టి పరిశీలనలో ఉన్నపాఠ్యాంశాలలోని పదజాలం విద్యార్థినీ/ విద్యారుల ఆలోచనలను ఏవిధంగా ప్రభావితం చేసి, మతతత్వం వైపు మళ్ళించి, వారిలో మతతత్వ ధోరణులను ఎంత తీవ్రతరం చేసిందో/చేస్తోందో గమనించవచ్చును.

ఈ విధంగా పాఠ్యగ్రంథాల ద్వారా విద్యార్థుల మనస్సులలోకి ప్రవేశిస్తున్న మతతత్వ భావనల దుష్ప్రభావాన్ని డాకర్‌ సాంబశివారెడ్డి మరింత వివరంగా స్పష్టీకరిస్తూ పాఠ్యాంశాల్లో ఉన్నమతతత్వభావజాల ప్రయోగాన్నీ, విద్యార్థినీ/విద్యార్థుల వివిధ సమాధానాల సారాంశాన్నీ పరిశీలిస్తే మతతత్వ భావజాల- మతతత్వ చరిత్ర రచనా దాృక్పథం పాఠ్యాంశాలను పూర్తిగా దుర్గందపూరితం చేసి, కలుషితం చేసాయని (చేస్తున్నాయని) స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా దారుణ మైన/ఘోరమైన విషయం. ముఖ్యంగా 'జిహాద్‌', 'జిజియా', 'పరదాపద్ధతి' వంటి భావాలను విద్యార్థినీ/విద్యార్థులు మత తత్వంతో కూడిన భావజాలంతో విశృంఖలంగా ప్రయాగించడం చూస్తే పాఠ్యాంశాలు ఏవిధంగా వారి మెదళ్ళను పూర్తిగా తప్పుదారి పట్టించి, మతతత్వంతో (నింపివేసాయో) నింపివేస్తున్నాయో పరిశీలించవచ్చును. దీనిద్వారా పాఠ్యాంశాలు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయో, అవి ఎంత కుంచించుకుపోయాయో ఊహించవచ్చును. అంతేకాకుండా ఇవి విద్యార్థినీ/విద్యారులలో సంకుచితతత్వాన్నీ (Narrow mindedness), మతవిద్వేషాన్నీ (Religious hatred) కల్గించే విధంగా భావజాలాన్ని కలిగి ఉన్నాయి. సమాజంలో మతోన్మాదభావాలు పెచ్చరిల్లిపోవడానికి చాలావరకు ఈ మతతత్వచారిత్రక దృక్పథంతో రచింపబడుతున్నపాఠ్య పుసకాలే మూల హేతువులవుతున్నవి. ఇవి విచ్ఛిన్నకర శక్తులకూ, సంఘవిద్రోహక శక్తులకూ, దుర్మార్గ పాలకవర్గాలకూ మహదావకాశాన్ని ఇస్తున్నాయి అని ప్రకటించారు. (గీటురాయి 11-08-2006, పేజి. 1-2).

ప్రజల మీద ఆరాచకాలు సాగించిన పాలకుల ఆ పాలకుల సైన్యాలను వారి పేరుతో తప్పనిసరిగా ఉటంకించవచ్చు. అలా కాకుండా పాలకుడు ఇస్లాం మతస్థుడయితే అతని పాలనను ముస్లిం పాలనగా, అతడు ప్రదర్శించిన క్రౌర్యాన్ని హిందూ మతస్థులకు వ్యతిరేకంగా సాగిన ముస్లిం క్రౌర్యంగా, అతని సైన్యాలను ముస్లిం సెన్యాలుగా వర్ణించటం అచారిత్రకం. అత్యంత దారుణం.

ఈ ప్రమాదాకరమైన వర్ణన ప్రజల మీద ముస్లిం వ్యతిరేకతను గాఢంగా స్థిరపర్చుతుంది. ఈ విధమైన విద్వేష-వ్యతిరేక ప్రచారం పాఠ్య గ్రంథాల ద్వారా ఆరంభమై

268