పుట:1857 ముస్లింలు.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు


తుగ్లక్ను గురించి, ...ఇతడు ముస్లిం అయినందున మహమ్మదీయుల దగ్గర 1/4వంతు హిందాువుల వద్ద 1/2వ వంతు పన్నులను వసూలు చేసెను... ఇతని కాలంలో హిందువులు చాలా కష్టనష్టములు అనుభవించారు...(ఇతడు) హిందువులను చాలా కష్ట పెపెట్టెడివాడు. ..తమ మతమువారిని బాగా చూసుకోనేడివాడు... ...... మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ముస్లిం రాజు కాబట్టి తమ మతమును బాగా ప్రచారంలోనికి తీసుకొనివచ్చి నాడు. హిందువులను హింసించెను. (హిందువులను) చాలామందిని ముస్లిములుగా మరల్చినాడు (మార్చినాడు)...హిందూ దేవాలయములను పడగొట్టించి, (వాటిపై) ముస్లిం దేవాలయాలను పెద్దపెద్ద భవనములుగా (మసీదులుగా) నిర్మించినాడు..., ...ఇతడు పరమతద్వేషి. హిందూ దేవాలయాలను కొల్లగొట్టెను...(హిందువులను) ఇస్లాంమతంలో చేరమని బలవంత పెట్టేవాడు (బలవంతం చేసేవాడు), భారతీయ సంస్కతిపై ఇస్లాంమత ప్రబావం 'అనే దానికి, ...(మహమ్మదీయులు) అతి నీచంగా హిందూస్రీలను బలవంతంగా తీసుకొని వెళ్ళారు. దాన్ని భరించలేక హిందాువులు (తమ) స్త్రీలను చిన్న వయస్సునందే బాల్య వివాహాలు చేయడం మొదలెట్టారు...., ...ముస్లింలు మన భారతదశంలో ఎన్నో చోట్ల కలహాలను సృష్టించారు. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ వంటివారు ముస్లింమతంలో చేరకపోతే హింసించుట, ఎక్కువపన్నులు విధించుట వంటివి చేసెడివారు... ముస్లింల వంటివారు మతకలహాలను సృష్టించినవారు ఎక్కువగా ఉంది (ఉండేవారు). ముస్లింలు హిందువుల ఆలయాలలో బాంబులు పెట్టి పేల్చెడివారు. (అందువలన) చాలామంది ముస్లిం, హిందూ ప్రజలు చనిపోయేడివారు, 'జహంగీర్‌ పరిపాలన'పై....ఇతడు హిందువులను ఎప్పుడూ హింసించేవాడు. హిందువులను చాలా హీనంగా చూసేవాడు. తన మతంలో (ఇస్లాంమతంలో) చేరమని బలవంతపెట్టేవాడు, ...ఇతడు హిందువులపై జిజియా పన్నువిధించాడు...., 'బాబర్‌'ను గురించి, ...బాబర్‌ పరమతద్వేషి. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చెసెను. హిందువులను హింసించెను, ...బాబర్‌ కాలంలో బాబ్రిమసీదు నిర్మించడం జరిగింది, 'ఔరంగజేబు'ను గురించి, ...ఔరంగజేబు భారత దేశంలో హిందువులపట్ల ద్వేషాన్ని చూపిస్తూ బలవంతంగా ఇస్లాంమతంలో చేర్చడానికి ప్రయత్నించేవాడు...హిందూ విద్యా లయాలను, దేవాలయాలను ధ్వంసం చేసాడు, ఔరంగజేబు 200లకు పైగా హిందూ దేవాలయాలనూ, పాఠశాలలనూ కూల్చాడు. హిందువులను భ్రష్టుల్నిచేసాడు వంటి సమాధానాలను అనేకమంది విద్యార్థినీ/విద్యారులు


267