పుట:1857 ముస్లింలు.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

కళారూపాలలో ఆలోచితంగా గానీ అనాలోచితంగా గానీ ముస్లిం నియంతృత్వం -ముస్లింల అరాచకాలు తదితర అంశాలు బలంగా వేళ్ళానుకున్నాయి.

Prince of Wales ఇండియా రాక సందర్భంగా ప్రముఖ హింది రచయిత భారతేందు హరిశ్చంద్ర రాసిన ఒక కవితలో బ్రిటిషర్ల పాలన శతాబ్దాల ముస్లిం పాలన పీడనలను పెళ్లగించిందని ప్రశంసించాడు. భారతీయులలోని మేధాసంపత్తిని, శక్తి సామర్థ్యాలను, సంపదను, విద్యాగంధాన్ని ముస్లింల పాలన విద్వంసం చేసిందన్న ఆరోపణలతో హరిశ్చంద్ర తన సాహిత్య ప్రస్తానాన్ని సాగించారు. మరొక హిందీ రచయిత ప్రతాప్‌ నారాయణ మిశ్రా కూడా హరిశ్చంద్ర దారిలో సాగుతూ ముస్లింలను విదేశీయులు, అపవిత్రులు అని దూషించాడు. సతీ సహగమనం, పర్దా లాంటి సామాజిక రుగ్మతలు ముస్లింలు భారత దేశంలోకి అడుగిడటం వలననే వచ్చాయని ప్రకటించాడు. సుప్రసద్ద హిందీ రచయిత రాధాచరణ గోస్వామి బెంగాలీ నుండి హిందీలోకి అనువదించిన ప్రఖ్యాత నాటకం Bharat Me Yavan Raj లో మరింత వెనక్కు వెళ్ళి యవనులు, ముస్లింల కబంధాహస్తాల నుండి ఆర్యులను విముక్తం చేసినందుకు ఆంగ్లేయులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈయనగారు జాతీయోద్యమ నాయకుడు కూడా కావటం గమనార్హం !

ఈ మార్గంలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషలకు చెందిన సాహితీ ప్రముఖులు గోపాల్‌రావు హరి దేశ్‌ముఖ్‌, నర్మదా శంకర్‌, దల్పత్‌ రాం లాంటి చాలామంది ముస్లిం వ్యతిరేక భావజాలంతో రచనలు చేశారు. ఆంగ్లేయుల భాష, భావజాలాన్ని ఈ రచయితలు-కవులు అనుసరించారు. ఈ రచనలు ప్రజలలో బాగా పాపులర్‌ కావటం ద్వారా ఆ భావజాలాన్ని ప్రజానీకంలో ప్రజ్వలింప చేశాయి. (Roots of Communalism In India, MAK Siddiqui, Abadi Publications, Culcutta, 1999:Communalisam, Rampunyani, BSFC, Mumbai, 2005, P. 28)

ఈ విధగా 19, 20 వ శతాబ్దాల నాటి ప్రముఖ వ్యక్తులు, కవులు, రచయితలు, చరిత్రకారులలో అత్యధికులు ముస్లిం పాలకుల మీద అసత్య, అర్థసత్య ప్రచారాలను సాగించారు. అవాసవాలను సృషించి ముస్లింల పట్ల ముస్లిమేతర ప్రజానీకంలో అపోహలు, అపార్ధాలు కలుగచేశారు. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి స్వమతంలోని స్వజనుల ఉచ్ఛనీచాల చూపులకు, చేతలకు గురౌతున్న ప్రజలను కౌగలించుకుని,

260