పుట:1857 ముస్లింలు.pdf/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

విషయాన్ని విస్మరించి, ముస్లిం పాలకులు క్రూరులని తీర్మానించుకున్న కొందరు ముస్లిం ప్రజలకు కూడాఆ క్రూరత్వాన్ని అంటగయట్టారు.

బ్రిటిష్‌ చరిత్రకారుల గ్రంథాల మీద ఆధారపడి వాస్తవాలకు అతీతంగా ముస్లిం వ్యతిరేక నిర్ణయాలకు వచ్చిన స్వదేశీయులు, స్వదేశీ చరిత్రకారులు, ఆంగ్లేయుల బాటలో నడిచి పరాయి పాలకుల పెత్తనం కమ్మగా ఉందన్న అభిప్రాయాన్ని తమ చర్యల ద్వారా, రచనల ద్వారా ప్రజలో కలుగ చేశారు. ఓ నిర్దిష్ట ప్రయోజనాన్నిరాబట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రయోజనవాదులైన ఆంగ్లేయ చరిత్రకారుల ఎత్తులను అర్థం చేసుకోలేక కొందరు, ఆంగ్లేయుల చరిత్ర రచనను వాస్తంగా భావించిన మరికొందరు, ఆంగ్లేయుల అనుగ్రహం కోసం ఉద్దేశ్యపూర్వకంగా ఇంకొందరు, ముస్లింలంటే ద్వేషభావం కలిగి ఉన్నమరికొందరు ఆంగ్లేయుల పక్షాన వకాల్తా తీసుకుని తమ రచనలలో ముస్లింల క్రూర పాలన అను అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో ఆంగ్లేయుల అనుకూల ప్రక్రియ ఆధునిక భారత పితామహుడు (Father of Modern India) గా ఖ్యాతిగాంచిన ప్రమఖుడు రాజా రాంమోహన్‌ రాయ్‌ నుండి ప్రారంభమైంది. ఆంగేయులు హిందువులను ముస్లిం నియతృత్వం నుండి విముక్తి కలిగించారన్నభావనకు ఆయన మద్దతు నిచ్చాడు. ఆయన బ్రిటిష్‌ రాజుకు రాసిన ఒక లేఖలోబ్రిటిష్‌ పాలన భారతీయులకు లభించేంత వరకు తరచుగా వారి (హిందువుల) ఆస్తులు కొల్లగొట్టబడ్డాయి. వారి మతం ఆవమానించబడింది. వారి రక్తం చిందించ బడింది, అని రాశాడు. (Their property was often plundered, their religion insulted and their blood wantonly shed.... till divine providence at last in its abundant mercy, stirred up the British nation to break the yoke of these tyrants and receive the oppressed nations of Bengal under its Protection - History and Culture of the Indian people Vol. IX, Bharathiya Vidya Bhavan, Bombay, P.11)

ఆధునిక యుగ ప్రవక్తగా, హిందూ-ఇస్లామిక్‌-పాశ్చ్యాత్య సంస్కతుల సమ్మిశ్రిత వ్యకిత్వం గల మహనీయుడిగా భావించబడుతున్న రాజా రాంమోహనరాయ్‌ అభిప్రాయం వెల్లడయ్యాక స్థానిక మేధావులు, సంస్కర్తలు, చరిత్రకారులు ఆ భావాలను యదార్ధాలుగా

256